"ఖలేజా" ఫ్లాప్ కావటానికి ప్రధాన కారణం అదే...మహేష్
"ఖలేజా" చిత్రం ఫ్లాఫ్ కావటానికి ప్రధాన కారణం..నేను దాదాపు మూడు సంవత్సరాలు గ్యాప్ తీసుకోవటమేనంటున్నారు మహేష్. ఆయన తాజాగా మీడియాతో మాట్లాడుతూ..ఏ స్టార్ కీ కూడా అంత లాంగ్ గ్యాప్ రాకూడదు..అది నేను చేసిన తప్పు..అదే సినిమా రిజల్టుకు ప్రబావితం చూపింది. ఇక మూడేళ్ళ తర్వాత సినిమా అంటే విపరీతమైన ఎక్సపెక్టేషన్స్ ఏర్పడతాయి.వాటిని అందుకోవటం..అధిగమించటం కష్టమే అన్నారు. ఇక ప్రస్తుతం తాను శ్రీను వైట్లతో చేస్తున్న దూకుడు ఎవరినీ నిరాశపరచదని మాత్రం అని చెప్పగలను. ప్రస్తుతం ఇస్తాంబుల్ షెడ్యూల్ పూర్తయింది. ఇది పూర్తి యాక్షన్ తో కలిసిన ఎంటర్టైన్మెంట్ సినిమా. మొదటి షెడ్యూల్ ఇస్తాంబుల్ లో పూర్తి చేసుకు వచ్చాము అన్నారు.
మహేష్ బాబు అనుష్క త్రివిక్రమ్ శ్రీనివాస్ అతడు ఖలేజా mahesh babu anushka trivikram srinivas athadu khaleja


Click it and Unblock the Notifications