మా అబ్బాయి భయం భయంగా...మహేష్ బాబు
పూనేలో ఫ్యామిలీతో కలిసి హృతిక్ రోషన్ నటించిన 'కైట్స్' సినిమాని చూశాను. మా అబ్బాయి గౌతమ్ చూసిన మొదటి సినిమా ఇదే. భయం భయంగా, విచిత్రాన్ని చూస్తున్నట్లు అతను ఆ సినిమా చూశాడని మహేష్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. పూనేలో దాదాపు నెల రోజులు పాటు జరిగిన షెడ్యూల్ పూర్తి చేసుకుని ఇటీవలే వచ్చారు మహేష్. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ లో రెగ్యులర్ గా పాల్గొంటున్నారు. ఆయన పూనేలో షూటింగ్ గురించి ట్వీట్ చేస్తూ...పూనే షెడ్యూల్ ప్రశాంతంగా జరిగింది. కొంత టాకీ, ఫైట్స్ చిత్రీకరించాం. రిస్కీ ఫైట్స్ చేయడం థ్రిల్ కు గురి చేసింది.
ముఖ్యంగా మా అబ్బాయి గౌతమ్ గురించి చెప్పాలి. పూనేలో నాతో పాటే ఉన్నాడు. అల్లరి చేయకుండా చక్కగా ఉండటంతో నాకు సౌకర్యవంతంగా అనిపించింది' అని పేర్కొన్నారు. నెల రోజులు కంటిన్యూ షెడ్యూల్ ఉండటంతో...తన భార్య నమ్రత, కుమారుడు గౌతమ్ ని కూడా పూనేకి తీసుకెళ్లారు మహేష్ బాబు. అక్కడ షూటింగ్ లో పాల్గొనడం, తీరిక వేళల్లో నమ్రత, గౌతమ్ లతో టైమ్ స్పెండ్ చేయడంతో మహేష్ బిజీగా గడిపారు. ఇక ఈ చిత్రం మరో మూడురోజుల షూటింగ్ తో టాకీ పార్ట్ పూర్తవుతుంది. ఈ చిత్రంలో మహేష్ సరసన అనుష్క హీరోయిన్ గా చేస్తోంది. శింగనమల రమేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











