Don't Miss!
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- News విశాఖ లోక్సభ పరిధిలో ఆ సామాజిక వర్గందే పెత్తనం..బొత్స ఝాన్సీకి కలిసొస్తుందా..?
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మహేష్ బాబుకు యాక్షన్ చెప్పిన అర్జున్ రెడ్డి దర్శకుడు.. మరోసారి తమన్నాతో కలిసి..
కొన్ని కాంబినేషన్ లలో సినిమా వస్తే చూడాలని ఆడియెన్స్ చాలా బలంగా కోరుకుంటారు. మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా గత కొన్నాళ్లుగా అర్జున్ రెడ్డి దర్శకిడితో తమ హీరో ఒక సినిమా చేస్తే చూడాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చాలా కాలంగా ఈ కాంబినేషన్ పై అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. అయితే ఒక విదంగా భవిష్యత్తులో విల్లు కలిసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రీసెంట్ గా వీరి కాంబినేషన్ లో ఒక షూటింగ్ జరిగింది.
2020లో మరో సినిమా అనుకుంటే..
సూపర్ స్టార్ మహేష్ బాబు గత ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో బాక్సాఫీస్ వద్ద సాలీడ్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక 2020లోనే మరో సినిమా రావాలని ప్లాన్ చేసుకున్న మహేష్ కు కరోనా గ్యాప్ ఇచ్చింది. పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
సంక్రాంతికి పవన్ తో పోటీగా
ఇక SVPకి సంబంధించిన కొన్ని కీలక షెడ్యూల్స్ కూడా పూర్తయ్యాయి. సినిమా అక్టోబర్ లోపు పూర్తి చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ బిగ్ బడ్జెట్ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తోంది. ఇక సినిమాను 2022 సంక్రాంతి విడుదల చేయబోతున్నారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు కూడా పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న విషయం తెలిసిందే.
అర్జున్ రెడ్డి దర్శకుడితో మహేష్
ఇక చాలా రోజుల తరువాత మహేష్ బాబు - తమన్నా కాంబినేషన్ లో షూటింగ్ మొదలవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఆ షూటింగ్ లో దర్శకుడు సందీప్ రెడ్డి యాక్షన్ చెప్పడం విశేషం. తమన్నా మహేష్ బాబుతో ఆగడు సినిమా చేసిన విషయం తెలిసిందే. ఇక చివరగా సరిలేరు నీకెవ్వరులో ఆమె ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించింది.
కమర్షియల్ యాడ్ కోసం ఇలా..
ఇక సందీప్ రెడ్డి వంగా మహేష్ బాబుతో సినిమా చేయాలని చాలా సార్లు ప్రయత్నాలు చేశాడు గాని వర్కౌట్ కాలేదు. ఇక మొదటిసారి అర్జున్ రెడ్డి దర్శకుడు మహేష్ కు యాక్షన్ చెప్పాడు. నిజానికి వీళ్ళు చేసింది సినిమా షూటింగ్ కాదు. ఒక కమర్షియల్ యాడ్. కిచెన్ అండ్ హోమ్ కు అప్లయెన్సెస్ కు సంబంధించిన హావేల్స్ కంపెనీ యాడ్ షూట్ కోసం ఇలా కలిసి వర్క్ చేశారు. మరి భవిష్యత్తులో ఈ కాంబోలో సినిమా వస్తుందో లేదో చూడాలి.