For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బ్యాడ్ న్యూస్ చెప్పిన మహేశ్ టీమ్: ఆయన చనిపోవడం వల్లే ఇలా.. అది మాత్రం విడుదలయ్యే అవకాశం!

  |

  దాదాపు రెండు దశాబ్దాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తన హవాను చూపిస్తూ దూసుకుపోతున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో సూపర్ హిట్లను అందుకున్న అతడు.. పదుల సంఖ్యలో అవార్డులను సైతం తన ఖాతాలో వేసుకున్నాడు. అదే సమయంలో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సైతం దక్కించుకున్నాడు. దీంతో సోషల్ మీడియాలోనూ ట్రెండ్ సెట్ చేస్తూ దూసుకెళ్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో మహేశ్ బాబు టీమ్ నుంచి ఓ ప్రకటన వెలువడింది. ఇందులో ఆయన అభిమానులు నిరాశ పడే న్యూస్ కనిపించింది. ఆ వివరాలు మీకోసం!

  హ్యాట్రిక్ అందుకున్న మహేశ్ బాబు

  హ్యాట్రిక్ అందుకున్న మహేశ్ బాబు

  కొన్నేళ్లుగా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. కొరటాల శివ తీసిన ‘భరత్ అనే నేను', వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ‘మహర్షి', అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘సరిలేరు నీకెవ్వరు' చిత్రాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. వీటితో హ్యాట్రిక్‌ను అందుకున్న అతడు.. రికార్డులను కూడా క్రియేట్ చేశాడు. దీంతో మహేశ్ ఫ్యాన్స్ జోష్‌లో ఉన్నారు.

  సర్కారు వారి పాటతో వస్తున్నాడు

  సర్కారు వారి పాటతో వస్తున్నాడు

  సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో పాటు మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. దీనికి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం సమకూర్చుతున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి రాబోతుంది.

  ఆదిలోనే అడ్డంకి... మళ్లీ ఆగిందిగా

  ఆదిలోనే అడ్డంకి... మళ్లీ ఆగిందిగా

  ‘సర్కారు వారి పాట' సినిమాను గత ఏడాది లాక్‌డౌన్‌కు ముందే ప్రకటించారు. కానీ, అప్పుడే దీన్ని ప్రారంభించడానికి వీలు పడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ జనవరిలో మొదటి షెడ్యూల్‌ను మొదలు పెట్టారు. దుబాయ్‌లో జరిగిన ఇందులో హీరో ఇంట్రడక్షన్ సీన్స్‌తో పాటు కొన్ని ప్రేమ సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. అయితే, అంతలోనే కరోనా కారణంగా మళ్లీ వాయిదా వేశారు.

  కృష్ణ పుట్టినరోజున మూవీ సర్‌ప్రైజ్

  కృష్ణ పుట్టినరోజున మూవీ సర్‌ప్రైజ్

  సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా మే 31 తేదీన ‘సర్కారు వారి పాట' మూవీ నుంచి ఏదైనా సర్‌ప్రైజ్ ఉండబోతుందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. అంతేకాదు, ఈ సినిమా నుంచి వచ్చేది టీజర్‌ అని బాగా టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో మహేశ్ బాబు మూవీ నుంచి పోస్టర్‌గానీ, పాట గానీ వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా అంటున్నారు.

  బ్యాడ్ న్యూస్ చెప్పిన మహేశ్ టీమ్

  బ్యాడ్ న్యూస్ చెప్పిన మహేశ్ టీమ్

  ఇక, రెండు మూడు రోజులుగా ‘సర్కారు వారి పాట' సినిమా నుంచి 30 సెకెన్ల నిడివి గల ఓ టీజర్ విడుదల కాబోతుందని వార్తలు వస్తున్నాయి. దీంతో సూపర్ స్టార్ మహేశ్ బాబు అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో సైతం ట్రెండ్ సెట్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇలాంటి సమయంలోనే మహేశ్ బాబు టీమ్ ఓ బ్యాడ్ న్యూస్‌ను చెప్పింది.

  ఆయన మరణించడం వల్లే ఇలాగ

  ఆయన మరణించడం వల్లే ఇలాగ

  మహేశ్ బాబు టీమ్ పేరిట తాజాగా ఓ ప్రకటన బయటకు వచ్చింది. ఇందులో ‘ప్రస్తుత పరిస్థితులు బాగోలేని కారణంగా సర్కారు వారి పాట నుంచి ఎటువంటి అప్‌డేట్ రావట్లేదు. మా పేరిట వచ్చే ఏ అప్‌డేట్‌నూ నమ్మకండి. ఏదైనా ఉంటే మా అధికారిక ఖాతాల ద్వారానే వెల్లడిస్తాం. అలాగే, మే 31నే బీఏ రాజు గారి 11వ రోజు కూడా ఉంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం' అని పేర్కొన్నారు.

  Allu Arjun యుట్యూబ్ లో, Mahesh Babu ట్విట్టర్ లో Thaggede Le || Filmibeat Telugu
  అది మాత్రం వచ్చే అవకాశం అంటూ

  అది మాత్రం వచ్చే అవకాశం అంటూ

  తాజాగా బయటకు వచ్చిన ప్రకటనలో ‘సర్కారు వారి పాట'కు సంబంధించిన అప్‌డేట్ గురించి మాత్రమే ప్రస్తావించారు. అంటే త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ బాబు నటించబోతున్న సినిమాకు సంబంధించిన సర్‌ప్రైజ్ మాత్రం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక, అదే రోజున ఈ సినిమా టైటిల్ లోగో విడుదల అవబోతుందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే.

  English summary
  Mahesh Babu Now Doing Sarkaru Vaari Paata Movie under Parasuram Direction. Now Mahesh Babu Team Clarity about Sarkaru Vaari Paata Update.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X