రాజమౌళి నెక్ట్స్ మూవీ మహేష్ బాబుతోనే, ఎప్పుడంటే....
రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ ఖరారైంది. ఈ చిత్రం వచ్చే ఏడాది చివర్లో ప్రారంభం కానుంది.
తెలుగులో ఇపుడున్న మోస్ట్ పాపులర్ హీరో ఎవరు అంటే ముందుగా వినిపించే పేరు మహేష్ బాబు. మరి అలాంటి మహేష్ బాబుతో బాహుబలి లాంటి భారీ ప్రాజెక్టులను తెరకెక్కించి, అపజయం అంటే ఏమిటో తెలియని దర్శకుడిగా పేరుతెచ్చుకున్న రాజమౌళి జతకడితే? బాక్సాఫీసు వద్ద ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ బద్దలవ్వాల్సిందే.
అభిమానులు కోరుకుంటున్న ఈ కాంబినేషన్ త్వరలోనే నిజం కాబోతోంది. ఇటీవల 'స్పైడర్' మూవీ ప్రమోషన్లో భాగంగా మీడియా ఇంటర్వ్యూలో మహేష్ బాబు మాట్లాడుతూ.... రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు వెల్లడించారు.

రాజమౌళి నెక్ట్స్ ప్రాజెక్ట్ మహేష్ బాబుతోనే..
బాహుబలి తర్వాత తాను చేయబోయే సినిమా ఏది? అనేది రాజమౌళి ఇంకా ప్రకటించలేదు. అయితే ఆయన తన నెక్ట్స్ మూవీ మహేష్ బాబుతోనే చేయబోతున్నారని టాక్. ప్రస్తుతం మహేష్ బాబు కూడా దీనిపై క్లూ ఇచ్చారు.
Recommended Video


కొడితే గట్టిగానే కొట్టాలి
ప్రస్తుతం రాజమౌళి స్క్రిప్టు వర్క్ లో బిజీగా ఉన్నారు. అది పూర్తి చేసి మహేష్ బాబు నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత ఈ విషయం అఫీషియల్ గా వెల్లడించే అవకాశం ఉంది. కాస్త టైమ్ తీసుకున్నా సరే బాక్సాఫీసు గట్టిగా కొట్టాలనేది రాజమౌళి ప్లాన్.

వచ్చే ఏడాది మొదలవ్వ వచ్చు
అన్నీ అనుకున్నట్లు జరిగితే మహేష్ బాబు-రాజమౌళి సినిమా 2018 నవంబర్లో లేదా డిసెంబర్లో మొదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఈ లోగా రాజమౌళి తన స్క్రిప్టు పూర్తి చేసి ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేయనున్నారు.

భారీ చిత్రం
రాజమౌళి సినిమా అంటేనే భారీగా ఉంటుంది. మహేష్ బాబుతో ఆయన చేయబోయే సినిమా మహేష్ బాబు కెరీర్లోనే హయ్యెస్ట్ బడ్జెట్ చిత్రంగా ఉండబోతోందని టాక్. అఫీషియల్ ప్రకటన తర్వాత పూర్తి వివరాల వెల్లడికానున్నాయి.

మహేష్ బాబు బిజీ బిజీ
ప్రస్తుతం మహేష్ బాబు నటించిన ‘స్పైడర్' మూవీ విడుదలకు సిద్ధమైంది. దీంతో పాటు ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అను నేను' అనే చిత్రం చేస్తున్నారు. దీని తర్వాత రాజమౌళి దర్శకత్వంలో సినిమాకు డేట్స్ ఇవ్వనున్నారు.

స్పైడర్ మూవీ
స్పైడర్ మూవీ మహేష్ బాబు కోరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కించిన చిత్రం. ఈ చిత్రం ద్వారా ఆయన తమిళ మార్కెట్లోనూ అడుగు పెడుతున్నారు. 120 కోట్ల ఖర్చుతో తెరకెక్కిన ఈచిత్రం 150 నుండి 200 కోట్లు వసూలు చేస్తుందని అంచనా. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈచిత్రం సెప్టెంబర్ 27న విడుదల కాబోతోంది.


Click it and Unblock the Notifications











