మహేష్ బాబు-త్రివిక్రమ్ ముచ్చటగా మూడోసారి!
హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముచ్చటగా మరోసారి కలిసి పని చేయబోతున్నారా? అంటే అవుననే వార్తలు ఇపుడు ఫిల్మ్ నగర్లో హల్ చల్ చేస్తున్నాయి. గతంలో వీరి కాంబినేషన్లో 'అతడు', 'ఖలేజా' చిత్రాలు తెరకెక్కాయి.
తాజాగా వీరి కాంబినేషన్లో రాబోయే సినిమాను ప్రముఖ నిర్మాత జి రాధాకృష్ణ హారిక-హాసిని క్రియేషన్స్ పతాకంపై నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇద్దరూ ప్రస్తుతం ఇదర సినిమాలతో బిజీగా ఉండటంతో ఈ చిత్రం సెట్స్ పైకి 2015లో వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు.

ప్రస్తుతం మహేష్ బాబు శ్రీను వైట్ల దర్శకత్వంలో 'ఆగడు' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత మరో చిత్రానికి కూడా మహేష్ బాబు కమిట్ అయ్యాడు. ఈ రెండు ప్రాజెక్తులు పూర్తయిన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రాజెక్టు కోసం మహేష్ బాబు డేట్స్ ఇచ్చే అవకాశం ఉంది.
ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈచిత్ర ప్రారంభోత్సవం కూడా జరిగింది. ఈ చిత్రంలో సమంత ఈ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించబోతున్నారు. ఇదివరకు 'జులాయి'కి కూడా ఈయనే స్వరాలు సమకూర్చారు. హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కబోతోంది.


Click it and Unblock the Notifications











