ఇప్పటిదాకా ఆ విషయం మా ఫ్యామిలీకి మాత్రమే తెలుసు.. సీక్రెట్ చెప్పి షాకిచ్చిన మహేష్ బాబు

Recommended Video

Mahesh Babu About His Health Problem || సీక్రెట్ చెప్పి షాకిచ్చిన మహేష్ బాబు

సినీ సెలెబ్రెటీలకు సంబంధించిన సీక్రెట్స్ అంటే ప్రేక్షకులకు అమితమైన ఆసక్తి ఉంటుంది. అలాంటి ఓ విషయం ఇప్పుడు బయటపడింది. మహేష్ బాబుకు సంబంధించిన ఈ విషయం హాట్ టాపిక్ అవుతోంది. పైగా ఈ విషయాన్ని మహేష్ బాబే స్వయంగా ప్రకటించడం జనాల్లో చర్చనీయాంశంగా మారింది. కానీ ఆ విషయం చెబుతూ మహేష్ తీసుకొచ్చిన అవగాహన మాత్రం వావ్! అనిపిస్తోంది. ఇంతకీ అసలు సంగతేంటి? అంటారా.. పూర్తి వివరాలు మీ కోసం..

సాధారణంగా బయటపెట్టరు.. కానీ మహేష్ బాబు!

సాధారణంగా బయటపెట్టరు.. కానీ మహేష్ బాబు!

మామూలు జనం లాగే సినిమా హీరోహీరోయిన్లకు కూడా ఆరోగ్య సమస్యలు ఉంటాయి. అయితే వాటిని సీక్రెట్‌గా ఉంచుతుంటారు. కెరీర్‌కి ఎక్కడ మైనెస్ అవుతుందో అని తమ తమ ఆరోగ్య సమస్యలను దాచేస్తుంటారు నటీనటులు. కానీ అందుకు భిన్నంగా తన హెల్త్ ప్రాబ్లెమ్ గురించి స్వయంగా వెల్లడించి షాకిచ్చారు స్టార్ హీరో మహేష్ బాబు.

ఆ వ్యాధితో బాధ పడేవాడిని.. చివరకు

ఆ వ్యాధితో బాధ పడేవాడిని.. చివరకు

ఒకప్పుడు తాను విపరీతమైన మైగ్రేన్ సమస్యతో బాధ పడేవాడినని తాజాగా ఇంటర్వ్యూలో చెప్పాడు మహేష్ బాబు. ఆ బాధ నుండి బయటపడడానికి చాలా మంది వైద్యులను సంప్రదించినా నయం కాలేదని, చివరకు చక్రసిద్ధ నాడి వైద్యంతో ఆ సమస్య నుంచి బయటపడ్డానని తెలిపారు. అలాగే ఈ సీక్రెట్ ఇలా బటయపెడుతున్నందుకు కారణం కూడా చెప్పారు మహేష్.

తన భార్య నమ్రత ద్వారా..

తన భార్య నమ్రత ద్వారా..

మైగ్రేన్ సమస్యతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న సమయంలో తన భార్య నమ్రత.. ఓ స్నేహితురాలి ద్వారా సత్య సింధూజ అనే డాక్టర్‌ని కలిసిందని, ఆమెకు చక్రసిద్ద నాడీ వైద్యం గురించి తెలుసని చెప్పాడు. ఆమె అందించిన చికిత్స తీసుకున్న తర్వాత మైగ్రేన్ పూర్తిగా తగ్గిపోయిందని తెలిపారు మహేష్. ఇప్పుడున్న టాబ్లెట్లు కేవలం నొప్పిని తాత్కాలికంగా నివారిస్తాయని, మైగ్రేన్ తగ్గించుకునేందుకు ఇది సరైన పద్ధతి కాదని ఆయన తెలిపారు.

అందుకే మీడియా ముందుకు

అందుకే మీడియా ముందుకు

మైగ్రేన్ సమస్యతో బాధపడుతున్నవారికి ఎలా నివారించుకోవాలో తెలియాలనే ఈ విషయాన్ని మీడియా ముందు చెబుతున్నానని మహేష్ అన్నారు. ఇప్పటిదాకా తనకు మైగ్రేన్ సమస్య ఉండనే విషయం ఫ్యామిలీ, స్టాఫ్‌కి మాత్రమే తెలుసని, కానీ ఈ చక్రసిద్ధ నాడీ వైద్యం గురించి అందరికీ తెలిపే ఉద్దేశం తోనే ఇలా ఈ విషయం బయటపెడుతున్నానని మహేష్ అన్నారు.

మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు'

మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు'

ప్రస్తుతం మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X