‘మగాడు’ అంటే అసలు అర్థం చెప్పిన మహేష్ బాబు
హైదరాబాద్ : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 'మగాడు' అనే పదానికి అసలైన అర్థం చెబుతూ ప్రచారం మొదలు పెట్టారు. 'అద్దంలో చూసుకున్న ప్రతిసారీ.....తల్లి, సోదరి, భార్య, కూతురు తనవాడు అని గర్వించే మగాడిలా కనిపించాలనుకుంటాను' అంటూ ఆయన గళం విప్పారు.
మహిళలపై లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ప్రారంభమైన 'మర్డ్' ఉద్యమంలో పలువురు బాలీవుడ్ స్టార్లతో పాటు తెలుగు సినిమా పరిశ్రమ నుంచి మహేష్ బాబు పాలుపంచుకోబోతున్నాడు. బాలీవుడ్ దర్శకుడు, నటుడు పర్హాన్ అక్తర్ ఈ 'మర్డ్' ఉద్యమాన్ని ప్రారంభించారు.
'సమాజంలో ఓ మంచి మార్పు కోసం చేస్తున్న ఈ ప్రయత్నాన్ని సపోర్టు చేస్తున్నందుకు థాంక్స్ మహేష్' అంటూ ఫర్హాన్ అక్తర్ ట్వీట్ చేసారు. మహిళలపై జరుగుతున్న లైంగిక వేదింపులు, అత్యాచారాలకు కదిలిపోయిన పర్హాన్ అక్తర్ 'మెన్ అగైనిస్ట్ రేప్ అండ్ డిస్క్రిమినేషన్'(MARD) అనే సంస్థను ప్రారంభించారు.
సమాజంలో స్త్రీకి ఉన్న ప్రాధాన్యం ఏమిటి? ఆమెను ఏ విధంగా గౌరవించాలి? అనే విషయాల్లో మగవాళ్లకు అవగాహన కల్పించడమే ఈ మర్డ్ ఉద్యమం ఉద్దేశ్యం. 'మర్డ్' సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలందరికీ చేరేలా చేయ్యగలవారు ఎవరా అని కొన్ని రోజులు సర్వే చేసి మరీ....మహేష్ బాబుని ఎంచుకున్నారు.
ఇతర భాషల్లోకి కూడా దీన్ని అనువదిస్తున్నారు. అదే విధంగా మరాఠీ భాషలో ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ వాయిస్ ఇచ్చారు. త్వరలోనే వీరి వాయిస్‌ను మనం ప్రచార మాద్యమాల్లో వినబోతున్నాం. దేశంలోని ఇతర భాషల్లో కూడా 'మర్డ్' ప్రచారం సాగనుంది. ఆయా ప్రాంతాల్లో పాపులర్ స్టార్ల వాయిస్‌ను ఈ కాంపెయిన్ కోసం రికార్డు చేయనున్నారు.


Click it and Unblock the Notifications












