ఆగడు విషయంలో...మహేష్ బాబు రొటీన్ ట్వీట్స్
హైదరాబాద్: తను నటించిన సినిమాల ఆడియో ఫంక్షన్లు, సినిమాల విడుదల ముందు, తన కొడుకు, కూతురు పుట్టినరోజు సందర్బంలో తప్ప.....మహేష్ బాబు దాదాపుగా ట్విట్టర్ జోలికి వెళ్లరు. సినిమా విడుదల ముందు దర్శకులు, నిర్మాతలు, మ్యూజిక్ డైరెక్టర్లపై ట్విట్టర్ ద్వారా పొగడ్తలు గుప్పించడం మహేష్ బాబుకు అలవాటు. దీంతో పాటు సినిమా విడుదల రోజు సెలబ్రేట్ చేసుకుందాం అంటూ అభిమానులను ఉత్తేజపరుస్తుంటారు. గత కొంత కాలంగా మహేష్ బాబు ట్విట్టర్ అకౌంట్లో రోటీన్‌గా కనిపిస్తున్న ట్వీట్లు ఇవి.
తాజాగా ‘ఆగడు' విడుదల సందర్భంగా కూడా మహేష్ బాబు మళ్లీ అదే పని చేసారు. "ఆగడు సినిమా డబ్బింగ్ పూర్తయింది. చాలా రిలాక్స్‌గా ఉంది. కెరీర్ చాలా హ్యాపీగా సాగుతోంది. కెరీర్‌లో నన్ను మెట్టు ఎక్కించిన శ్రీను గారికి థాంక్స్, లవ్ యూ సార్. 19న అంతా సెలబ్రేట్ చేసుకుందాం" అంటూ ట్వీట్ చేసారు.

'దూకుడు' వంటి భారి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత మహేష్ బాబు, శ్రీను వైట్ల, తమన్ కాంబినేషన్లో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా ఇది. అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలు. సెప్టెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈచిత్రంలో మహేష్ బాబు సరసన తమన్నా హీరోయిన్. పోస్టు ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయి. సెన్సార్ కార్యక్రమాలకు ఫస్ట్ కాపీ సిద్ధమైంది. ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవల విడుదలైన ఆడియోకు మంచి స్పందన వస్తోంది. ఆగడు టైటిల్ సాంగ్, నారి నారి, జంక్షన్లో..., తూ ఆజా సరోజా పాటలు శ్రోతల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.


Click it and Unblock the Notifications











