నా కెరీర్లోనే బిగ్గెస్ట్: ‘మహర్షి’ విజయంపై మహేష్ బాబు భావోద్వేగం

Recommended Video

Mahesh Babu Got Emotional On Maharshi Movie Success || Filmibeat Telugu

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన 'మహర్షి' చిత్రానికి బాక్సాఫీసు వద్ద అద్భుతమైన స్పందన వస్తోంది. సామాజిక అంశాలను ప్రస్తావిస్తూ, రైతుల ప్రాముఖ్యత, దేశానికి వారి అవసరాన్ని గుర్తు చేస్తూ సందేశాత్మకంగా రూపొందిన ఈ చిత్రానికి ప్రేక్షకులు నీరాజనం పడుతున్నారు.

ముందు నుంచీ ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉండటంతో 'మహర్షి' చిత్రం తొలిరోజు అద్భుతమైన వసూళ్లు సాధించింది. నైజాంతో పాటు కొన్ని ఏరియాల్లో నాన్ బాహుబలి రికార్డులను సైతం బద్దలు కొట్టింది. సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుండటంపై మహేష్ బాబుతో పాటు చిత్ర బృందం హ్యాపీగా ఉంది. ఈ విజయంపై మహేష్ బాబు స్పందించారు.

నా కెరీర్లోనే బిగ్గెస్ట్

నా కెరీర్లోనే బిగ్గెస్ట్

‘‘మీ అభిమానం వల్ల నా జర్నీ ఎంతో ప్రత్యేకంగా సాగుతోంది. నేను నటించిన 25వ సినిమాను ఆదరించి నా కెరీర్లోనే బిగ్గెస్ట్‌గా చేశారు. మీ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంగా ఉంది. అభిమానులకు, ప్రేక్షకులకు థాంక్స్.'' అంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ ట్వీట్ చేశారు.

నా గుండె లోతుల్లో నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నా

నా గుండె లోతుల్లో నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నా

‘మహర్షి' చిత్రానికి అద్భుతమైన టీమ్ పని చేసింది. డైరెక్టర్ వంశీ పైడిపల్లి సినిమాను హ్యాండిల్ చేసిన విధానం ఎంతో నచ్చింది. ఇదొక గొప్ప విజయం. ఇలాంటి విజయం నాకు అందించిన అందరికీ కృతజ్ఞతలు. ఇది నా గుండె లోతుల్లో నుంచి వస్తున్న స్పందన అంటూ మహేష్ బాబు భావోద్వేగానికి గురయ్యారు.

తొలి రోజు ఏపీ తెలంగాణలో అదుర్స్

తొలి రోజు ఏపీ తెలంగాణలో అదుర్స్

‘మహర్షి' మూవీ తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి టోటల్ రూ. 24.6 కోట్లు వసూలు చేసింది. ఏరియా వైజ్ వసూళ్లు పరిశీలిస్తే... నైజాంలో రూ. 6.38 కోట్లు, సీడెడ్ రూ. 2.89 కోట్లు, ఉత్తరాంధ్ర రూ. 2.88 కోట్లు, ఈస్ట్ గోదావరి రూ. 3.2 కోట్లు, వెస్ట్ గోదావరి రూ. 2.47 కోట్లు, కృష్ణ రూ. .39 కోట్లు, గుంటూరు 4.4 కోట్లు, నెల్లూరు రూ. 1 కోటి వసూలు చేసింది.

అందుకే కాస్త స్లో... టార్గెట్ ఫస్ట్ వీకెండ్

అందుకే కాస్త స్లో... టార్గెట్ ఫస్ట్ వీకెండ్

రెండో రోజు కూడా ‘మహర్షి' చిత్రానికి వసూళ్ల వరద పారింది. సినిమా గురువారం విడుదల కావడం, పబ్లిక్ హాలిడే లాంటివి ఏమీ లేక పోవడంతో ఫస్ట్ డే ఓవరాల్ కలెక్షన్ల విషయంలో 5వ స్థానంతో సరిపెటుకుంది. అయితే ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యే నాటికి వసూళ్లు భారీగా ఉంటాయని అంచనా వేస్తున్నారు.

మహర్షి

మహర్షి

మహేష్ బాబు కెరీర్లో 25వ చిత్రంగా ‘మహర్షి' తెరకెక్కింది. పూజా హెడ్గే హీరోయిన్‌గా నటించగా... అల్లరి నరేష్ కీలక పాత్ర పోషించారు. ఇంకా ఈ చిత్రంలో అనన్య, మీనాక్షి దీక్షిత్, జగపతి బాబు, రాజేంద్రప్రసాద్, సాయి కుమార్, ముఖేష్ రిషి, ప్రకాష్ రాజ్, నాజర్, నరేష్, పోసాని, జయసుధ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. దిల్ రాజు, అశ్వినీదత్, పివిపి నిర్మాతలు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X