పూరి, మహేష్ ల 'ది బిజినెస్ మెన్'తో మరో రికార్డ్ ఖాయం...!
సూపర్ స్టార్ మహేష్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ల 'పోకిరి' కాంబినేషన్ లో ఆర్.ఆర్.మూవీ మేకర్స్ పతాకంపై అగ్రనిర్మాత డా.వెంకట్ నిర్మిస్తున్న ప్రేస్టీజియస్ మూవీ 'ది బిజినెస్ మెన్' జులైలో ప్రారంభమై ఆగస్టు నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. 'బిజినెస్ మెన్'గా మహేష్ బాబు ఇంతకుముందు పోషించని పవర్ ఫుల్ క్యారెక్టర్ పోషిస్తున్నారు. ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ సరసన తొలిసారి కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.
పూరి జగన్నాధ్ చెప్పిన బిజినెస్ మెన్ స్క్రిప్ట్ అద్భుతంగా వుందని ప్రిన్స్ మహేష్ బాబు చెప్పారు. 'గన్స్ డోంట్ నీడ్ అగ్రిమెంట్స్' అనే ఉపశీర్షిక తో పూరి జగన్నాథ్ ఈ చిత్రానికి ఓ స్పెషల్ క్రేజ్ తీసుకొచ్చారు. ఈ కేప్షన్ ని బట్టి ఈ సినిమా కధ ఎలా వుంటుందో ఊహించుకోవచ్చు. సూపర్ స్టార్ మహేష్ కెరీర్లో ఇది మరోబిగ్గేస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందని పూరి చెప్పారు. ఈ చిత్రం సబ్జెక్ట్ ఎక్ష్త్రా ఆర్డినరీ గా వుంది. మహేష్, పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో 'ది బిజినెస్ మెన్' తెలుగు చలన చిత్ర రంగంలో అద్భుతాలను క్రియేట్ చేస్తుందని నిర్మాత డా.వెంకట్ చెప్పారు.


Click it and Unblock the Notifications











