»   » బిజెనెస్ మేన్‌లో హీరో పాత్ర ఆసాధారణం: మహేష్

బిజెనెస్ మేన్‌లో హీరో పాత్ర ఆసాధారణం: మహేష్

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    మహేష్ బాబు హీరోగా చేస్తున్న'బిజినెస్ మేన్' చిత్రం ఆగస్ట్ 15న ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం ఆర్.ఆర్.మూవీస్ సంస్థ కార్యాలయంలో జరిగింది. దేవుని పటాలపై తొలిషాట్ చిత్రీకరించారు.ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ "పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో 'పోకిరి' తర్వాత చేస్తున్న సినిమా ఇది. కథ విన్నప్పటి నుంచీ ఎంతో ఎక్సైట్ అవుతున్నాను. హీరో పాత్ర ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటుంది. ఆర్.ఆర్.వెంకట్‌గారి బేనర్‌లో ఈ సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది. పూరిగారి కాంబినేషన్‌లో అందరూ ఎక్స్‌పెక్ట్ చేసే రేంజ్‌లో ఈ చిత్రం ఉంటుంది'' అని అన్నారు.

    అనంతరం దర్శకుడు పూరీ జగన్నాధ్ మాట్లాడుతూ..."పోకిరి లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత మళ్ళీ మహేష్‌తో చెయ్యడం చాలా హ్యాపీగా ఉంది. 'బిజినెస్ మేన్' కోసం ఫ్యాన్స్‌తో పాటు నేను కూడా ఎప్పుడెప్పుడూ అని ఎదురుచూస్తున్నాను. అంటే అంత కాన్ఫిడెంట్‌గా వున్నాను ఈ సబ్జెక్ట్ మీద. ఇంతవరకూ నేను దర్శకత్వం చేసిన అన్ని సినిమాల్లోకి ఈ సినిమాలో హీరో పాత్ర బెస్ట్ అనిపించేలా ఉంటుంది.లవ్ అండ్ యాక్షన్ ప్రధానంగా ఉండే సినిమా. వెంకట్‌గారి లాంటి డైనమిక్ ప్రొడ్యూసర్‌తో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. సెప్టెంబర్ 1న షూటింగ్‌ను ప్రారంభించి సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అన్నారు.

    నిర్మాత మాట్లాడుతూ "మహేష్‌ బాబు పూరి కాంబినేషన్‌లో మా సంస్థ నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ 'బిజినెస్ మేన్'. కథ చాలా బాగుంది. మహేష్‌ని ప్రేక్షకులు, ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో అలాంటి పాత్రతో వస్తున్న సినిమా ఇది. స్టైలిష్‌గా, లావిష్‌గా, హై టెక్నికల్ వేల్యూస్‌తో రూపొందుతోంది. ఈ చిత్రంపై మహేష్, పూరి చాలా నమ్మకంగా ఉన్నారు. పర్‌ఫెక్ట్ షెడ్యూల్లో పూర్తి చేసి ప్రపంచ వ్యాప్తంగా జనవరి 12న గ్రాండ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. మా సంస్థ ఇమేజ్‌ని మరింత పెంచే చిత్రమవుతుంది'' అని అన్నారు.

    కాజల్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి సంగీతం: థమన్, ఛాయాగ్రహణం: శ్యామ్.కె.నాయుడు, కళ: చిన్నా, ఫైట్స్: విజయ్, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, సహనిర్మాత: వి.సురేష్‌రెడ్డి, నిర్మాత: డా.వెంకట్, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు- దర్శకత్వం: పూరి జగన్నాథ్.

    English summary
    Mahesh Babu-Puri Jagannadh combo movie The Business Man was launched on August 15th morning at producer Venkat's office in Hyderabad. Mahesh Babu, Puri Jagannadh along with crew of the film cinematographer Sham K Naidu, music director Taman, executive producer Suresh Reddy were present at the launch.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more