twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ బాబుకి ఇప్పుడు కొత్త ఛాలెంజ్

    By Srikanya
    |

    మహేష్ బాబు తాజా చిత్రం దూకుడు కలెక్షన్స్ పరంగా రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎఫెక్టు మహేష్ కి కొత్త ఛాలెంజ్ లు విసురుతుందని అంటున్నారు. ఆయన తదుపరి చిత్రం ది బిజినెస్ మ్యాన్ పై ప్రేక్షకుల్లో అంచనాలు విపరీతంగా పెరిగిపోవటం ఖాయమని వాటిని రీచ్ అవ్వటానికి మహేష్ శాయిశక్తులా కృషి చెయ్యాల్సిందే అని సీనియర్స్ వ్యాఖ్యానిస్తున్నారు. పోకిరి హిట్ నుంచి ఇప్పుడిప్పుడే బయిటపడి దూకుడుని ఇచ్చాడని, ఆ కామిడీ ఇమేజ్ నుంచి ఒక్కసారిగా బిజెనెస్ మ్యాన్ గా ఒప్పించటం మహేష్ కి సాధ్యమే అయినా నల్లేరు మీద నడక మాత్రం కాదంటున్నారు. ఇక ది బిజెనెస్ మ్యాన్ విషయానికి వస్తే...ఈ చిత్రం నేపధ్యం ముంబై మాఫియాలోని ఆయుధాల వ్యాపారం..కొనుగోళ్ళు ..అమ్మకాల చుట్టూ తిరగనుందని తెలుస్తోంది.

    ముంబైలోనే ఎక్కువ బాగం షూట్ చేయాలని పూరీ భావిస్తున్నారు.గన్స్ నీడ్స్ నో ఎగ్రిమెంట్స్ అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ చిత్రం పూర్తిగా స్టైలిష్ గా సాగే యాక్షన్ ఎంటర్టైన్మెంట్ అని చెప్తున్నారు.ఇక ఈ చిత్రం ముంబై మాఫియాకి చెందిన కథగా తెరకెక్కుతోంది. 'బిజినెస్‌మ్యాన్‌'గా టైటిల్‌కు తగిన పాత్ర అది. పోకిరి తర్వాత అంతటి హిట్‌ ఇవ్వాలని పట్టుదలతో ఉన్నాం అంటున్నారు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్. ఆర్.ఆర్.మూవీస్ పతాకంపై ఆయన రూపొందించబోయే చిత్రం గురించి మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని అందివ్వాలని దర్శక,నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.అలాగే ఈ చిత్రంలో తొలిసారిగా కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: థమన్, ఛాయాగ్రహణం: శ్యామ్.కె.నాయుడు, కళ: చిన్నా, ఫైట్స్: విజయ్, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, సహనిర్మాత: వి.సురేష్‌రెడ్డి, నిర్మాత: డా.వెంకట్, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు- దర్శకత్వం: పూరి జగన్నాథ్.

    English summary
    ‘The Businessman’ and already, the hype has begun to pick up like wildfire. This has led to double the expectations from all corners and more from fans of Mahesh Babu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X