twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సంక్రాంతి విడుదల కోసం యమ దూకుడు మీదున్న బిజినెస్ మ్యాన్..!?

    By Sindhu
    |

    దూకుడు సినిమా విజయం ఇచ్చిన స్పూర్తితో మహేష్ బాబు 'బిజినెస్ మేన్' చిత్రం షూటింగులో ఉత్సాహంగా పాల్గొంటున్నాడు. ఈ చిత్రం కోసం ఈ నెల 4, 5, 6 తేదీల్లో ముంబైలో మహేష్ బాబు, కాజల్ పై దర్శకుడు పూరీ జగన్నాథ్ ఓ థీం సాంగ్ ను షూట్ చేశాడు. ఇందు కోసం ముంబైలో ప్రత్యేకమైన సెట్స్ కూడా వేశారు. 'దూకుడు' సినిమాలో 'గురువారం..' పాటను పాడిన రాహుల్ నంబియార్ ఈ పాట పాడాడు.

    కాగా, ప్రస్తుతం టాకీ పార్ట్ కు సంబంధించిన సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. అలాగే ఈ నెలలో మరో పాటను కూడా చిత్రీకరిస్తారని తెలుస్తోంది. మరోపక్క ముంబైలోనే మ్యూజిక్ సిటింగ్స్ కూడా జరుగుతున్నాయి. ఈ చిత్రంలో మహేష్ క్యారెక్టర్ గురించి వెంకట్ మాట్లాడుతూ ఇందులో మహేష్ హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ అయితే పూర్తి వినోదభరితంగా మంచి కథతో నిర్మించబడుతోంది. తప్పకుండా మహేష్ ఫ్యాన్స్ ని, ప్రేక్షకులను సంతృప్తి పరుస్తుందన్నారు.

    కాజల్ ముఖ్యమైనటువంటి పాత్రలో నటిస్తోంది. ప్రకాష్ రాజ్, షాయజి షిండే ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. అలాగా కామిడీ ట్రాక్ కోసం బ్రహ్మాజీ, దర్మవరపు సుబ్రమణ్యం మరియు మరికొంతమంది సెలెక్ట్ చేసినట్టు సమాచారం. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఈ సినిమాకి మహేష్ తన పారితోషికంగా 10 కోట్లు తీసుకుంటున్నాడని విశ్వసనీయ సమాచారం. సంక్రాంతి సినిమావాళ్ళకు పెద్ద పండగగా మారిన సంగతి తెలిసిందే. వచ్చే సంక్రాంతి(2012) విడుదలల కోసం ఇప్పుటినుంచే షెడ్యూల్స్ ప్లాన్స్ జరుగుతున్నాయి. సంక్రాంతి పోటీలో ఈ సారి ముగ్గరు మధ్యే పోటీ ఉండబోతోందంటున్నారు. ఆ ముగ్గరూ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్. ఆ సినిమాలు ఏమిటంటే..పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్, ఎన్టీఆర్, బోయపాటి చిత్రం,మహేష్ ది బిజినెస్ మ్యాన్.!

    English summary
    Prince Mahesh Babu’s movie with Puri Jagannath, The Businessman, is progressing at a brisk pace. The movie is being targeted for a January 12th release and the shooting will be completed in one single long schedule.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X