‘సునామీ’లో మహేష్ బాబు క్యారెక్టర్లో 3 షేడ్స్
ఈ చిత్రంలో మహేష్ బాబు క్యారెక్టర్లో 3 డిఫరెంట్ షేడ్స్ కనిపిస్తాయని, ఇది వరకు ఎన్నడూ కనిపించని విధంగా మహేష్ బాబు కొత్తగా కనిపించి ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తాడని యూనిట్ సభ్యులు అంటున్నారు. సిక్స్ ప్యాక్ బాడీతో, రాక్ స్టార్‌గా, సైకలాజికల్ పేషెంట్‌గా డిఫరెంట్ షేడ్స్ ప్రదర్శిస్తాడట. ఇప్పటికే మంచి పేరున్న దర్శకుడు సుకుమార్, ఈ సినిమాతో టాప్ రేంజికి వెళ్లడం ఖాయం అనే వాదన వినిపిస్తోంది.
క్రితి సానన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా తేవాలని దర్శక, నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. పండుగ రోజున విడుదల అయ్యేలా చూడాలని, అప్పటికి పూర్తి చేయాలని నిర్ణయించుకున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.
ఇక గతంలో మహేష్‌తో 'దూకుడు' చిత్రాన్ని నిర్మించిన 14రీల్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అనిల్ సుంకర, గోపీచంద్ ఆచంట, రామ్ ఆచంట నిర్మాతలు. ప్రస్తుతం ఈచిత్రం షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో షాయాజీ షిండే, కిల్లి దోర్జీ, విక్రమ్ సింగ్, శ్రీనివాస్ రెడ్డి ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సాంకేతిక వివరాల్లోకి వెళితే... ఈ చిత్రానినికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: ఆర్ రత్నవేలు, స్టూడియో: 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ -స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుకుమార్.


Click it and Unblock the Notifications












