దమ్మురేపే రెస్పాన్స్ -మహేష్ బాబు షాక్!
సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ మల్టీ స్టారర్‌గా రాబోతున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం ఫస్ట్ లుక్ ట్రైలర్ కృష్ణ పుట్టిన రోజును పురస్కరించుకుని నిన్న విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనికి యూట్యూబ్‌లోనూ, ఫేస్ బుక్ లోనూ దుమ్మురేపే రెస్పాన్స్ వస్తోంది.
విడుదలైన తొలి రోజు ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో ఏకంగా 2, 27,319 హిట్స్ సొంతం చేసుకోగా...ఫేస్ బుక్‌లో 9416 మంది షేర్ చేసుకున్నారు. ఈరేంజిలో రెస్పాన్స్ రావడంతో మహేష్ బాబు ఒక్కసారిగా షాకయ్యారు. ఆనందంతో ఉబ్బితబ్బయ్యారు. 'ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది...నన్ను ఆదరిస్తున్న అందరికీ థాంక్స్..త్వరలోనే పండగ చేసుకుందాం' అంటూ తన ట్విట్టర్లో ట్వీట్ చేశాడు. 'మై ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ ఫాదర్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు' అంటూ తండ్రికి విషెస్ కూడా చెప్పారు.
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రంలో మహేష్ బాబు, వెంకటేష్ అన్నదమ్ములుగా నటిసున్నారు. మహేష్ బాబు సరసన సమంత, వెంకటేష్ సరసన అంజలి నటిస్తున్నారు. మిక్కీజే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ పై నిర్మిస్తున్నారు.
పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈచిత్రాన్ని రూపొందిస్తున్నారు. అన్నదమ్ముల అనుబంధం, కుటుంబ బంధాలను ఈచిత్రంలో అద్భుతంగా చూపించబోతున్నారు. ఇప్పటికే 35 శాతం షూటింగ్ పూర్తయిందని, సెప్టెంబర్ కల్లా ఈచిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని నిర్మాత దిల్ రాజు తెలిపారు.


Click it and Unblock the Notifications











