Don't Miss!
- News ఏప్రిల్ లో అంగారక యోగం: ఈ మూడు రాశుల వారికి ఆర్థిక నష్టాలు, ఊహించని కష్టాలు
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్‌మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్‌లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
HBDMaheshBabu.. దళపతి విజయ్‌ని ఛాలెంజ్ చేసిన మహేష్.. విషయం మామూలుగా లేదే!!
సూపర్ స్టార్ మహేష్ బాబు, దళపతి విజయ్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో ఎంతటి రచ్చ జరగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ మధ్య విజయ్ ఫ్యాన్స్ మహేష్ బాబు ఏ రేంజ్లో ట్రోల్స్ చేశారో, అది ఎంతటి వివాదంగా మారిందో అందరికీ తెలిసిందే. అయితే ఫ్యాన్స్ మాత్రమే అలా గొడవలు పెట్టుకుంటారని, హీరోలు మాత్రం ఎంతో సఖ్యతగా ఉంటారని మరోసారి నిరూపితమైంది.
ట్విట్టర్ వార్..
ఆ మధ్య లాక్ డౌన్ సమయంలో విజయ్ ఫ్యాన్స్, సూపర్ స్టార్ ఫ్యాన్స్ పెద్ద యుద్దమే జరిగింది. చివరకు అది కోలీవుడ్, టాలీవుడ్ అంటూ వేరుగా మారి మాటల యుద్దానికి దిగే వరకు వచ్చింది. గిల్లి (ఒక్కడు రీమేక్) సినిమా విషయంలో రేగిన వివాదంతో ఇరువురు హీరోల ఫ్యాన్స్ తీవ్రదూషణలకు దిగారు.
మహేష్ బాబు బర్త్ డే..
నేడు మహేష్ బాబు బర్త్ డే ఈ సందర్బంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. ప్రపంచం మొత్తం మహేష్ బాబు బర్త్ డే మార్మోగిపోయేలా ట్వీట్ల యుద్దం చేస్తున్నారు. ఇప్పటికే 40 మిలియన్ల ట్వీట్లు చేసి ప్రపంచ రికార్డులను నెలకొల్పారు.
|
మంచి పని చేసిన మహేష్ బాబు..
తన బర్త్ డే సందర్భంగా ఎలాంటి సెలెబ్రేషన్స్, ఆర్భాటాలు చేయవద్దని ముందే కోరాడు మహేష్ బాబు. అయితే తన వంతుగా అభిమానులకు ఓ రిక్వెస్ట్ చేశాడు. ప్లాస్మా దానంపై అందరికీ అవగాహన కల్పించాలని, దానం చేయాలని కోరాడు. తాజాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లోనూ భాగస్వామి అయ్యాడు.
ఇంతకంటే గొప్పగా..
తన బర్త్ డేను ఇంత కంటే గొప్పగా సెలెబ్రేట్ చేసుకోలేనని మహేష్ బాబు సంతోషాన్ని వ్యక్తం చేశాడు. తన ఇంటి ఆవరణలోనే మొక్కలు నాటి అందరిలోనూ స్ఫూర్తి నింపాడు. అంతేకాకుండా ఈ మంచి పనిని ముందుకు తీసుకెళ్లే బాధ్యతను కొందరికి అప్పగించాడు.
విజయ్‌కి చాలెంజ్ విసిరిన మహేష్..
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనేది ఎంతగా విస్తరిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖుల్లో చాలా మంది మొక్కలు నాటి ఆదర్శంగా నిలిచారు. ఇక ఇప్పుడు మహేష్ బాబు మొక్కలు నాటి.. తదుపరి బాధ్యతను ఎన్టీఆర్, దళపతి విజయ్, శ్రుతీ హాసన్‌కు అప్పగించాడు.
Recommended Video
అంతా ఒక్కటే..
ఇందులో విజయ్ను నామినేట్ చేయడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. బయటేమో ఫ్యాన్స్ అలా ఒకరి మీద ఒకరు కారాలు మిరియాలు నూరుతుంటే వీరేమో మొక్కలు నాటమని ఛాలెంజ్‌లు విసురుకుంటున్నారు. మొత్తానికి ఫ్యాన్స్ మధ్యే ఆ గొడవలు కానీ తామంతా ఒక్కటేనని మరోసారి నిరూపించుకున్నారు.