కేక పుట్టిస్తున్న మహేష్ బాబు ‘తుఫాన్’
హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా కాలంగా థమ్స్అప్ సాఫ్ట్ డ్రింక్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సదరు కంపెనీ మహేష్ బాబుతో అదిరపోయే యాక్షన్ సన్ని వేశాలతో పలు యాడ్లు చిత్రీకరించింది. తాజాగా థమ్స్ అప్ కంపెనీ 'తూఫాన్' పేరిట మరో యాడ్ చిత్రీకరించింది. ఇందులో మహేష్ బాబు హెలికాప్టర్‌తో చేసే స్టంట్స్ అదిరిపోయేలా ఉన్నాయి.
ఇక మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే, ప్రస్తుతం మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం నెక్ట్స్ షెడ్యూల్ లండన్లో ప్లాన్ చేస్తున్నారు. దాదాపు 40 రోజుల పాటు అక్కడే షూటింగ్ జరుగనున్నట్లు తెలుస్తోంది. అక్కడ పలు కీలక సీన్లు చిత్రీకరించనున్నారు. త్వరలో ఈ షూటింగ్ షెడ్యూల్ డేట్స్ ఖరారు కానున్నాయి.
ఈ చిత్రంలో క్రితి సానన్ హారోయిన్ గా చేస్తోంది. మహేష్‌తో 'దూకుడు' చిత్రాన్ని నిర్మించిన 14రీల్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి తాజాగా అందిన ఆసక్తికర సమాచారం ఏమిటంటే.... బాలీవుడ్ మూవీ 'ఏక్ థా టైగర్'కు అద్భుతమైన ఫైట్స్ కంపోజ్ చేసిన హాలీవుడ్ ఫైట్ మాస్టర్ కాన్రాడ్ పాల్మిశానో 'మహేష్ బాబు-సుకుమార్' సినిమాకు పని చేయబోతున్నారు.
ఈ చిత్రంలో షాయాజీ షిండే, కిల్లి దోర్జీ, విక్రమ్ సింగ్, శ్రీనివాస్ రెడ్డి ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సాంకేతిక వివరాల్లోకి వెళితే... ఈ చిత్రానినికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: ఆర్ రత్నవేలు, స్టూడియో: 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ -స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుకుమార్.


Click it and Unblock the Notifications












