మహేష్ బాబు నెక్ట్స్ మూవ్‌పై టెన్షన్?
టాలీవుడ్ నెం.1 స్థానం కోసం ఎప్పటి నుంచో పోటీ పడుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు దూకుడు భారీ విజయం, బిజినెస్ మేన్ రికార్డు స్థాయి హిట్ తో నెం.1 స్థానానికి చేరువయ్యారు. మరో హిట్ కొడితే హ్యాట్రిక్ తో మహేష్ బాబే నెం.1 అనే విషయం అందరూ ఒప్పుకోవాల్సిందే. బిజినెస్ మేన్ తర్వాత మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దానికంటే ముందు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో నటిస్తున్నారు.
సుకుమార్ మంచి టాలెంట్ ఉన్న దర్శకుడే, ఇప్పటి వరకు మంచి విజయవంతమైన సినిమాలనే తెరకెక్కించారు. అయినప్పటికీ కొందరు మహేష్ బాబు అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుకుమార్ కు ఇప్పటి వరకు పెద్ద హీరోలను హ్యాండిల్ చేసిన అనుభవం లేక పోవడమే ఇందుకు కారణం అనే వాదన వినిపిస్తోంది.
ఏది ఏమైనా మహేష్ బాబు తర్వాతి సినిమా విజయంవంతం అవ్వాలని, ఆయన టాలీవుడ్ నెం.1 స్థానానికి చేరుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఏం జరుగబోతోందో...ఈ సంవత్సరంలోనే తేలనుంది. ఇదిలా ఉంటే మహేష్ బాబుకు పోటీగా ఇతర హీరోలు తమదైన శైలిలో దూసుకొస్తుండటం మరో ఆసక్తికర అంశం.


Click it and Unblock the Notifications











