ఆర్నాల్డ్ స్వార్జ్ నెగ్గర్‌తో పాటు మహేష్ బాబు కూడా...!
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు శంకర్, విక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న ‘ఐ'(తెలుగులో ‘మనోహరుడు') చిత్రం ఆడియో వేడుక ఈ నెల 15న చెన్నైలో జరుగబోతోంది. ఈ ఆడియో వేడుకకు హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ స్వార్జ్ నెగ్గర్ చీఫ్ గెస్ట్‌గా హాజరు అవుతుండటంతో అందరి దృష్టి ఈ ఆడియో ఫంక్షన్ వైపు మళ్లింది. రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి ప్రముఖులు కూడా హాజరవుతున్నారు. మన తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబును కూడా దర్శకుడు శంకర్ ఈ ఆడియో వేడుకకు ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
ఇండియన్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన శంకర్.....పలు భారీ చిత్రాలు తెరకెక్కించిన రికార్డు స్థాయి విజయాలను తనఖాతాలో వేసుకున్నారు. తాజాగా ఆయన తమిళంలో ‘ఐ' (తెలుగులో మనోహరుడు) అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తమిళ హీరో విక్రమ్ హీరోగా నటిస్తున్న ఈచిత్రంలో అమీ జాక్సన్ హీరోయిన్.

శంకర్ సినిమాలకు క్రేజ్ ఏ రేంజిలో ఉంటుందో మరోసారి ప్రూవ్ అయింది. ‘ఐ' చిత్రం శాటిలైట్ రైట్స్ తమిళ ఛానల్ జయా టీవీ రూ. 22 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. ఇంత భారీ మొత్తానికి శాటిలైట్స్ అమ్ముడు పోవడం తమిళ సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.
భారీ చిత్రాల నిర్మాణ సంస్థ అస్కార్ ఫిలిమ్స్ ప్రై.లి. బ్యానర్ పై అస్కార్ రవిచంద్రన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. 185 కోట్ల భారీ బడ్జెట్, హలీవుడ్ సాంకేతికతో ఈ సినిమా రూపొందుతుంది. ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది.
ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా దాదాపు 17 భాషల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. శంకర్ దర్శకత్వం వహించిన రోబోను 9 భాషల్లో విడుదల చేశారు. రజనీకాంత్ నటించిన కోచ్చడయాన్ ను 15 భాషల్లో విడుదల చేసారు. ఆ సినిమాను మించి తన 'ఐ' చిత్రాన్ని 17 భాషల్లో విడుదల చేయడానికి శంకర్ ప్లాన్ చేస్తున్నారట.


Click it and Unblock the Notifications











