»   » మహేష్ సెంటిమెంట్ ని నమ్మి...మిగతా హీరోలు కూడా..

మహేష్ సెంటిమెంట్ ని నమ్మి...మిగతా హీరోలు కూడా..

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : ఫామ్ లో ఉన్న హీరో ఏం చేస్తే మిగతా ప్రపచం దాన్ని అనుకరించటానికి,అనుసరించటానికి ప్రయత్నించటం సహజం. ప్రస్తుతం తెలుగులో తిరుగులేని చక్రవర్తిగా..సూపర్ స్టార్ గా వెలుగుతున్న హీరో మహేష్ బాబు. వరస హిట్స్ తో దూసుకుపోతున్న మహేష్ పైనే, ఆయన విజయాల వెనక ఉన్న సెంటిమెంట్స్ పైనే మిగతా సిని హీరోల దృష్టి. తాజాగా ఆయన అజ్మీర్ దర్గాకి వెళ్లి వచ్చారు. ఆయన రెగ్యులర్ గా ఆ దర్గాకి వెళ్లివస్తారని ప్రముఖంగా మీడియాలో వచ్చింది. దాంతో తెలుగులో కొందరు హీరోలు కూడా ఇదే విషయమై ఫాలో అయితే ఎలా ఉంటుందనే చర్చలలో ఉన్నట్లు సమాచారం. తాము ఆ దర్గాకు వెళ్లి ప్రార్ధనలు చేసి, విజయాన్ని సాధించాలనే ఆలోచనలో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు.

  దూకుడు విజయవంతం అయిన తర్వాత రెగ్యులర్ గా మహేష్ ..ఆ దర్గాని సందర్శిస్తున్నారు. బిజినెస్ మ్యాన్ రిలీజ్ కు ముందు కూడా ఆయన అక్కడకి వెళ్ళి ప్రార్దనలు చేసారు. ఈ సంవత్సరంలో ఈ దర్గాకు వెళ్లటం రెండో సారి. పిబ్రవరిలో మహేష్ ఓ సారి ఈ దర్గాకు వెళ్లి ప్రార్దనలు చేసి వచ్చారు. సంక్రాంతి కి విడుదల అవుతున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం విజవంతం కావాలని ఈ సారి దర్గాని దర్శించినట్లు చెప్తున్నారు. మహేష్ కు ఓసారి నమ్మకం ఏర్పడితే దాన్ని పూర్తిగా ఫాలో చేస్తారని ఆయన సన్నిహితులు చెప్తారు.

  ఇక వెంకటేష్‌, మహేష్‌బాబు కాంబినేషన్ లో దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. అడ్డాల శ్రీకాంత్ దర్సకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ కీలక పాత్రను పోషిస్తున్నారు. మహేష్ సరసన సమంత,వెంకటేష్ సరసన అంజలి హీరోయిన్స్ గా చేస్తున్నారు. వెంకటేష్,మహేష్ బాబు అన్నదమ్ములుగా ఈ చిత్రంలో కనపించనున్నారు. అంజలి..మహేష్ కు వదినగా చేస్తోంది.

  ఈ చిత్రం గురించి దిల్ రాజు మాట్లుడుతూ...అన్న కోసం తమ్ముడు అడవులకు వెళ్లితే అది రామాయణం. ఆస్తి కోసం అన్నదమ్ములు తగువుకి దిగితే... అది నేటి భారతం. రక్తం ఎప్పుడైతే పంచుకొని పుట్టారో, అప్పటి నుంచి పంపకాలు అలవాటైపోయాయి. 'అమ్మను నువ్వు చూసుకో - నాన్న నా దగ్గర ఉంటాడు. లేదంటే ఇద్దర్నీ చెరో ఆరు నెలలూ భరిద్దాం' - ఇలాంటి లెక్కలు వింటూనే ఉన్నాం. అందుకే ఉమ్మడి కుటుంబం ముక్కలైపోయింది. ఈ రోజుల్లోనూ ఆస్తుల్ని కాకుండా అనుబంధాల్నీ ఆప్యాయతల్నీ పంచుకొనే సోదరుల్ని మా చిత్రంలో చూపిస్తున్నామన్నారు.

  English summary
  superstar Mahesh has visited Ajmer Dargah to pray for the success of his upcoming movie 'Seethamma Vaakitlo Sirimalle Chettu'. Those who got the glimpse of our actor at that holy shrine got surprised by this act. Even during the release of 'Businessman' movie, and after the success of 'Dookudu' the star hero visited Ajmer Dargah. On the other hand, 'Seethamma Vaakitlo Sirimalle Chettu' is gearing up to hit theatres in three more weeks, and fans of both Mahesh and Venky are fingers crossed.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more