టాప్ 50 హ్యాండ్సమ్ మెన్‌లో ఆ తెలుగు హీరో
ది టైమ్స్ వెబ్ సైట్ వారు ఆన్ లైన్ లో ఓ సర్వే నిర్వహించింది. ఇండియాలో ఉన్న హ్యాండ్సమ్ మ్యాన్ ల లిస్ట్ తయారు చేయటం కోసం. జనవరి 15 వరకూ జరిగిన ఈ సర్వేలో 3.74 లక్షల మంది పాల్గొని ఓట్ చేసారు.వారి రిజల్ట్ ని షార్ట్ లిస్ట్ చేసి ఓ యాభై మందిని ప్రకటించారు. అందులో తెలుగు నుంచి మహేష్ బాబు పేరు ఉంది. ఆ లిస్ట్ లో ..అమీర్ ఖాన్, అభయ్ డియోల్,అభిషేక్ బచ్చన్,అజిత్,ధనుష్, సల్మాన్ ఖాన్,సూర్య,హృతిక్ రోషన్ వంటి హీరోలు,ఎమ్ ఎస్ ధోని, యువరాజ్ సింగ్ వంటి క్రికెటర్లు కూడా చోటు చేసుకున్నారు.
ఇక మహేష్ హవా..దూకుడు,బిజినెస్ మ్యాన్ చిత్రాలతో బాగా ఎక్కువైంది. అంతకుముందు కూడా తెలుగులో హ్యాండ్సమ్ హీరో ఎవరంటే మహేష్ అనే చెప్పేవారు ఇప్పుడు ఇండియా రేంజిలో సైతం అతను గుర్తింపడబడటం ఆ సినిమాల ఎఫెక్టే. అలాగే మహేష్ సినిమాలు హిందీ, తమిళంలోకి సైతం డబ్బింగ్ అవటం కూడా అక్కడ అభిమానులును సంపాదించుకునేలా చేస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే చాలా మంది మహేష్ తో హిందీ చిత్రం చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ మహేష్ కి ఆసక్తి లేకపోవటంతో వెనక్కి వెళ్తున్నారు.


Click it and Unblock the Notifications











