»   » ఇండియా వైడ్ సర్వే: టాప్ 10లో మహేష్.. 50లో రానా, ప్రభాస్, చెర్రీ!

ఇండియా వైడ్ సర్వే: టాప్ 10లో మహేష్.. 50లో రానా, ప్రభాస్, చెర్రీ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రతి ఏడాది టైమ్స్ సంస్థ మోస్ట్ డిజైరబుల్(ఎక్కువ మంది కోరుకునే) ఎవరు అనే అంశంపై సర్వే నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సర్వే ఆయా రాష్ట్రాల్లో విడివిడిగా చేయడంతో పాటు నేషనల్ వైడ్ కూడా ఓ సర్వే నిర్వహిస్తారు. ఇటీవల హైదరాబాద్ టైమ్స్ విభాగం నిర్వహించిన సర్వే వివరాలు వెల్లడించారు. అందులో మోస్ట్ డిజైరబుల్ మెన్స్ లిస్టులో మహేష్ బాబు నెం.1 స్థానం దక్కించుకోగా, మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ లిస్టులో అనుష్క నెం.1 స్థానం దక్కించుంది.

తాజాగా ఇండియా వైడ్ నిర్వహించిన సర్వే వివరాలు విడుదల చేసారు టైమ్స్ సంస్థ వారు. మొత్తం 50 మందితో కూడిన టాప్ లిస్టును రిలీజ్ చేసారు. 2015 సంవత్సరానికి గాను నిర్వహించిన ఈ సర్వేలో బాలీవుడ్ నటుడు రణవీర్ సంగ్ నెం.1 స్థానం దక్కించుకున్నాడు. రణవీర్ సింగ్ తనకు నెం.1 స్థానం దక్కడంపై సంతోషం వ్యక్తం చేయడంతో పాటు ఆశ్చర్యం వ్యక్తం చేయడం గమనార్హం. 2010లో నేను సినిమాల్లోకి వచ్చినపుడు అంతా నన్ను చూడ్డానికి ఏమంత బాగాలేవు అన్నారు. అందుకే నటన పరంగా నన్ను నేను నిరూపించుకోవడానికి ఎంతో కష్టపడ్డాను. ఇపుడు నాకు మోస్ట్ డిజైరబుల్ మెన్ గా నెం.1 స్థానం దక్కడం ఆనందంగా ఉంది అని చెప్పుకొచ్చాడు రణవీర్ సింగ్.

ఇండియా వైడ్ నిర్వహించిన ఈ సర్వేలో టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లి నెం.2 స్థానం దక్కించుకున్నాడు. తెలుగు నుండి కూడా పలవురు స్టార్లకు లిస్టులో చోటు దక్కింది. మహేష్ బాబు నెం.6 స్థానం దక్కించుకుని తెలుగు స్టార్లందరికంటే ముందున్నారు. రానా, ప్రభాస్, రామ్ చరణ్ లాంటి స్టార్లు కూడా ఈ లిస్టులో ఉన్నారు. వారు ఏ స్థానంలో ఉన్నారనే వివరాలు స్లైడ్ షోలో అందుకు సంబంధించిన వివరాలు...

రణవీర్ సింగ్

రణవీర్ సింగ్


బాలీవుడ్ నటుడు రణవీర్ సంగ్ ఈ లిస్టులో నెం.1 స్థానం దక్కించుకున్నాడు.

కోహ్లి

కోహ్లి


టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లి ఈ లిస్టులో నెం.2 స్థానం దక్కించుకున్నాడు.

ఫవాద్ ఖాన్

ఫవాద్ ఖాన్


బాలీవుడ్ నటుడు ఫవాద్ ఖాన్ ఈ లిస్టులో నెం.3 స్థానంలో ఉన్నాడు.

హృతిక్ రోషన్

హృతిక్ రోషన్


బాలీవుడ్ టాప్ స్టార్ హృతిక్ రోషన్ ఈ లిస్టులో నెం.4వ స్థానంలో ఉన్నారు.

సిద్ధార్థ్ మల్హోత్రా

సిద్ధార్థ్ మల్హోత్రా


బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా ఈ లిస్టులో 5వ స్థానంలో ఉన్నాడు.

మహేష్ బాబు

మహేష్ బాబు


టాలీవుడ్ నటుడు మహేష్ బాబు ఈ లిస్టులో 6వ స్థానం దక్కించుకున్నాడు. టాప్ 10లో లిస్టులో ఉన్న తెలుగు నటుడు మహేష్ బాబు మాత్రమే.

రానా దగ్గుబాటి

రానా దగ్గుబాటి


తెలుగు హీరో రానా దగ్గుబాటి ఈ లిస్టులో 11వ స్థానంలో ఉన్నారు.

ప్రభాస్

ప్రభాస్


బాహుబలి స్టార్ ప్రభాస్ ఈ లిస్టులో 13వ స్థానం దక్కించుకోవడం గమనార్హం.

రామ్ చరణ్

రామ్ చరణ్


ఈ లిస్టులో మరో తెలుగు స్టార్ రామ్ చరణ్ 38వ స్థానంలో ఉన్నారు.

English summary
Times of India like every year released the list of most desirable men for 2015. It wasn't a surprise that Ranveer Singh emerged as the numero uno on this list that compiles India's most irresistible men. He is thrilled about his win and tells us why being desirable is beyond being an attractive visual package.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X