Guntur Kaaram: రిలీజ్‌కు ముందే సలార్ రికార్డును బ్రేక్ చేసిన గుంటూరు కారం... అది మహేశ్ బాబు రేంజ్ అంటే!
సంక్రాంతి బరిలో ఉన్న సినిమాల్లో గుంటూరు కారం ఒకటి. సూపర్ స్టార్ మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా విడుదలకు ముందే సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ప్రభాస్ సలార్ సినిమా సొంతం చేసుకున్న రికార్డును మహేష్ బాబు గుంటూరు కారం బ్రేక్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న మహేశ్ బాబు ఫ్యాన్స్ ఇది కదా సూపర్ స్టార్ మహేశ్ రేంజ్ అంటే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్, సాంగ్స్ తో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. గుంటూరు కారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం సాయంత్రం గుంటూరులో ఘనంగా నిర్వహించారు. చిత్రయూనిట్ అంతా ఈ ఈవెంట్లో పాల్గొని సందడి చేశారు. అభిమానులు సైతం పెద్ద ఎత్తున వచ్చారు.
Recommended Video


ఇక గుంటూరు కారం సినిమాని భారీగా విడుదల చేయబోతున్నారు మేకర్స్. తెలుగు రాష్ట్రాల్లో 90 శాతం స్క్రీన్స్ ఈ సినిమాకే దక్కాయి. అయితే హైదరాబాద్ లో మల్టీప్లెక్స్ లో సినిమా అంటే అందరికి ముందు గుర్తొచ్చేది ప్రసాద్స్ ఐమ్యాక్స్ అనే విషయం తెలిసిందే. ఏ సినిమా రిలీజయినా మొదటి రోజు పొద్దున్నేథియేటర్ బయట సందడి కనిపిస్తుంది. రివ్యూల కోసం యూట్యూబ్ ఛానల్స్, మీడియా కూడా ఇక్కడికే వస్తుంటారు.
హైదరాబాద్ లోని సూపర్ స్టార్ ఫ్యాన్స్ అయినా, సినీ లవర్స్.. మల్టీప్లెక్స్ లో విడుదల రోజు సినిమాలు చూడాలనుకుంటే ప్రసాద్స్ మల్టీప్లెక్స్ కే వస్తుంటారు. ప్రసాద్స్ ఐమ్యాక్స్ లో 6 స్క్రీన్స్ ఉండగా రిలీజ్ రోజు ఆల్మోస్ట్ పెద్ద సినిమా ఉంటే అన్ని స్క్రీన్స్ ఇచ్చేస్తారు నిర్వహకులు. ఇక గవర్నమెంట్ నుంచి ఎక్స్‌ట్రా షోలకి పర్మిషన్ వస్తే తెల్లవారు జామున నుంచి అర్ధరాత్రి వరకు షోలు నడుస్తుంటాయి.

ప్రసాద్స్ ఐమ్యాక్స్ లో ఇటీవల ప్రభాస్ సలార్ సినిమా విడుదల రోజు 37 షోలు పడి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఇప్పుడు ఆ రికార్డును గుంటూరు కారం బ్రేక్ చేసింది. గుంటూరు కారం సినిమా విడుదల రోజు ఏకంగా 41 షోలు వేయనున్నారు నిర్వహకులు. ఈ విషయాన్ని ప్రసాద్స్ మల్టీప్లెక్స్ అధికారికంగా తెలిపింది.
గుంటూరు కారం సినిమాకి అర్ధరాత్రి నుంచే ఎక్స్‌ట్రా షోలకు పర్మిషన్ రావడంతో ఆ రోజు ఆల్మోస్ట్ అన్ని షోలు గుంటూరు కారం సినిమాకే ఇవ్వగా.... దీంతో హైదరాబాద్ ఒక్క ప్రసాద్స్ మల్టీ ప్లెక్స్ లోనే రికార్డ్ సెట్ చేస్తుంటే ఓవరాల్ గా మొదటి రోజు ఎక్కువ షోలు పడనున్నాయి. ఎక్కువ థియేటర్స్, భారీ కలెక్షన్స్ తో బాబు బాక్సాఫీస్ బద్దలుకొడతాడని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. చూడాలి మరి బాబు ఏ మేర రికార్డ్స్ బ్రేక్ చేయనున్నారో.


Click it and Unblock the Notifications











