Guntur Kaaram Trailer Review యాక్షన్ ఘాటు ఎక్కువైన గుంటూరు కారం.. ఇక కళ్లలో నీళ్లు కారాల్సిందే!
త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబోలో తెరకెక్కిన చిత్రం గుంటూరు కారం. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే మేకర్స్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్ లో లాంచ్ ఛేశారు. ఇక ఈ సినిమా ట్రైలర్ సూపర్ స్టార్ ఫ్యాన్సేనే కాకుండా మామూలు సినీ లవర్స్ ను కూడా ఆకట్టుకుంటుంది. మహేశ్ బాబు లుక్స్ కు ఫిదా అయిపోతున్నారు. ఈసినిమా సంక్రాంతి విన్నర్ గా నిలుస్తుందని అంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే....
సూపర్ మహేశ్ బాబు తాజాగా నటించిన మాస్ యాక్షన్ మూవీ గుంటూరు కారం. ఇక ఈ సినిమా ఈ సంక్రాంతి పండక్కి అట్టహాసంగా రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. ఇక వీరిద్దరి కాంబోలో వస్తున్న మూడవ చిత్రం ఇది. దీంతో ఈసినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‍రోడ్స్ వద్ద ఉన్న సుదర్శన్ థియేటర్లో లాంచ్ చేశారు.
Recommended Video


ఇక అంతకు ముందే సుదర్శన్ థియేటర్ వద్ద మహేశ్ బాబు భారీ కటౌట్ ను ఫ్యాన్స్ ఏర్పాటు చేశారు. ట్రైలర్ లాంఛ్ కావడంతో.. ఉదయం నుంచే అక్కడ హంగామా నెలకొంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 6న జరగాల్సి ఉండగా.. పలు కారణాలతో రద్దు చేశారు. అయితే తాజాగా ఈరోజు గుంటూరు కారం యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆధ్యంతం ఆకట్టుకుంటుంది. ఇది సూపర్ స్టార్ మహేశ్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అని చెప్పవచ్చు.
ఇక ట్రైలర్ విషయానికి వస్తే... మీరు మీ పెద్ద అబ్బాయిని అనాథలాగా వదిలేశారు అని అంటున్నారు అనే వాయిస్ ఓవర్ తో స్టార్ట్ అవుతుంది. ఇక మహేశ్ బాబు తల్లిగా రమ్యకృష్ణ నటిస్తుందని తెలుస్తోంది. గుస్ బంప్స్ మ్యూజిక్ తో.. మహేశ్ బాబు ఎంట్రీ ఉంటుంది. మిర్చి యాడ్ లో మిర్చి ఎగురుతూ.. మహేశ్ ఎంట్రీ ఇస్తాడు. ఇక మహేష్ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ ట్రైలర్ లో కామెడీ, లవ్, రొమాన్స్, ఎమోషన్ కలగలపి ఉన్నాయి.

ఇక శ్రీలీల, మహేశ్ బాబు మధ్య వచ్చే రొమాంటిక్ డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. లుంగీ కట్టుకుని మహేశ్ బాబు.. స్వాగ్.. వేరే లెవెల్. ఇక తమన్ అందించిన బీజీఎం అయితే నెక్ట్ లెవెల్ ఉంది. మీనాక్షి చౌదరి రెండు ఫ్రేమ్స్ లో కనిపించింది. ఇక విలన్ గా ప్రకాష్ రాజ్ కనిపించాడు. గుంటూరు కారం ఎర్రగా ఘాటుగా కనిపిస్తుంది. ఒక్కసారి నాలుకకు తగిలింది అనుకో.. కళ్లలోంచి వచ్చేది నీళ్లే అంటూ హర్ష వర్ధన్ చెప్పే డైలాగ్ హైలెట్ గా నిలిచింది. ఎప్పుడో చిన్నప్పుడు కొట్టాల్సిన అమ్మ.. ఇప్పుడు పిలిపించి.. ఇస్త్రీ చీర వేసుకుని మరీ కొడుతుంది అంటూ మహేశ్ చెప్పిన డైలాగ్ తో ట్రైలర్ ముగుస్తుంది. ఇక ఈ ట్రైలర్ మహేశ్ ఫ్యాన్స్ కే కాదు.. అందరికీ గుస్ బంప్స్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా తమన్ అందించిన సంగీతం అల్టిమేట్. తల్లిగా రమ్యకృష్ణ, తండ్రిగా జయరామ్ నటించాడు.
ఇక గుంటూరు కారం సినిమా విషయానికి వస్తే... ఈ సినిమాలో మహేశ్ బాబుకు జోడీగా శ్రీలీల, మీనాక్షి చౌదరిలు నటిస్తున్నారు. ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు. జగపతి బాబు, రమ్యకృష్ణ, జయరాం, ఈశ్వరిరావు, ప్రకాశ్ రాజ్, సునీల్ కీలక పాత్రల్లో నటించారు. హాసినీ అండ్ హారిక క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ (చినబాబు) ఈ మూవీని భారీ బడ్జెట్ తో నిర్మించారు. జనవరి 12న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











