GunturKaraam: మహేష్ బాబు ఫ్యాన్స్‌‌కు షాక్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు.. కారణం ఏమిటంటే?

సూపర్ స్టార్ మహేశ్ బాబు అభిమానులకు వెరీ బ్యాడ్ న్యూస్. మహేశ్ బాబు తాజాగా నటిస్తున్న చిత్రం గుంటూరు కారం. అయితే ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును జనవరి 6న జరుపనున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతే కాదు యూఎస్ఏ లైవ్ స్ట్రీమింగ్ ఇస్తున్నట్లు కూడా వెల్లడించారు. అయితే తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటు రద్దు అయినట్లు చిత్ర బృందం ప్రకటించింది. అసలు ఏం జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'గుంటూరు కారం'. ఇక ఈ సినిమా మరో కొన్ని రోజుల్లో ఆడియన్స్ ముందుకు వచ్చేయబోతుంది. మూవీ టీం ఒక పక్క పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చూసుకుంటూనే... మరోపక్క ప్రమోషన్స్ కూడా ప్రారంభించింది. ఈ క్రమంలోనే మూవీ నుంచి సాంగ్స్ వరుసగా రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు మేకర్స్. ఇక ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ కూడా ఫిక్స్ చేశారు.

Mahesh Babu Trivikram GunturKaraam movie pre release event cancelled Full Details Here

గుంటూరు కారం మూవీ ట్రైలర్ రిలీజ్ అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించబోతున్నట్లు ఇటీవల ప్రకటించారు. జనవరి 6 శనివారం నాడు ఈ ఈవెంట్ జరగబోతుందని ప్రకటించారు. ఆ ఈవెంట్ లోనే ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయబోతున్నారని అంతా అనుకున్నారు. అంతేకాదు ఈ ప్రీ రిలీజ్ ఈవెంటుతో మహేశ్ కొత్త ట్రెండ్ క్రియేట్ చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ ఈవెంటును అమెరికా థియేటర్స్ లో లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు.

ఇదంతా బాగానే ఉన్నా... ఇప్పుడు మహేశ్ బాబు అభిమానులకు చిత్ర బృందం షాకింగ్ న్యూస్ చెప్పింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును రద్దు చేసినట్లు సోషల్ మీడియావేదికగా ప్రకటించింది. గుంటూరు కారం చిత్ర బృందం ఓ నోట్ షేర్ చేసింది. అందులో.. మేము ఎంత ప్రయత్నించినప్పటికీ, ఊహించని పరిస్థితులు మరియు భద్రతా అనుమతుల సమస్యల కారణంగా గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంటును రద్దు చేస్తున్నాం. 6 జనవరి 2024న ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గుంటూరుకారం ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించడం లేదు. ఈ ప్రకటనకు మేము హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాము అంటూ రాసుకువచ్చారు.

Mahesh Babu Trivikram GunturKaraam movie pre release event cancelled Full Details Here

ఈ ప్రత్యేక నోట్ కు హార్ట్ సింబర్ బ్రేక్ అయింది జోడించారు. ఇక దీనితో పాటు.. గుంటూరు కారం ఈవెంట్ కోసం కొత్త తేదీని వీలైనంత త్వరగా ప్రకటిస్తామని తెలిపారు. ఇక ఈ న్యూస్ విన్న మహేశ్ ఫ్యాన్స్ నిరాశకు గురువుతున్నారు. ట్రైలర్ వస్తుందని ఆశగా ఎదురుచూస్తున్న వారికి వాళ్ల ఆశలపై నీళ్లు జల్లినట్లైంది. త్వరగా ఈవెంట్ అప్డేట్ ఇవ్వాలని కోరుతున్నారు.

ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. మహేశ్ బాబు త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న మూడవ చిత్రం ఇది. ఇక ఈ సినిమాలో మహేశ్ కు జోడిగా ఇద్దరు హీరోయిన్లు శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. తమన్ సంగీతం అందించగా.. హారికా హాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మాతగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X