మహేష్ కొత్తగా ట్రై చేస్తున్నాడు.. ఆ సౌండ్ భీభత్సమే.. ఎంతైనా సీఎం కదా!

సూపర్ స్టార్ మహేష్ బాబు తాను నటించే ప్రతి చిత్రం తన అభిమానులకు కొత్త అనుభూతిని పంచాలని ప్రయత్నిస్తుంటాడు. ఆ ప్రయత్నంలో భాగంగా మహేష్ రాజకీయ నాయకుడి అవతారం ఎత్తాడు. భరత్ అనే నేను చిత్రంలో మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈ తరహా పాత్రలో మహేష్ బాబు నటించడం ఇదే తొలిసారి. అందుకే తానే స్వయంగా సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నాడు మహేష్. పాత్రకు ప్రాణం పోయడానికి డబ్బింగ్ లో కొత్త పంథాని అవలంబించబోతున్నాడనేది లేటెస్ట్ న్యూస్.

Recommended Video

మహేష్ బాబు ‘ఫస్ట్ ఓథ్‌’పై సినీ స్టార్ల స్పందన..!
సూపర్ స్టార్ ని ముఖ్యమంత్రిగా చూడాలని

సూపర్ స్టార్ ని ముఖ్యమంత్రిగా చూడాలని

చాక్లెట్ బాయ్ లా కనిపించే సూపర్ స్టార్ సీఎంగా ఎలా ఉంటాడు అనే ఉత్కంఠ అభిమానుల్లో ఎక్కువైపోతోంది. ఈ తరహా పాత్రలో నటించడం మహేష్ కు ఇదే తొలిసారి.

బ్లాక్ బాస్టర్ కాంబినేషన్

బ్లాక్ బాస్టర్ కాంబినేషన్

శ్రీమంతుడు వంటి బ్లాక్ బాస్టర్ హిట్ తరువాత దర్శకుడు కొరటాల శివ, మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఇది. దీనితో ఈ చిత్రంపై తారాస్థాయిలో అంచనాలు ఉన్నాయి.

అచ్చు రాజకీయ నాయకుడికి వలే

అచ్చు రాజకీయ నాయకుడికి వలే

రిపబ్లిక్ డే సందర్భంగా మహేష్ తొలి ప్రమాణాన్ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఆ ఆడియోలో మహేష్ వాయిస్ అదిరిపోయింది. అచ్చు రాజకీయ నాయకుడికి వలె మహేష్ బాబు ప్రమాణ స్వీకారం ఉందని కామెంట్లు వినిపించాయి.

యంగ్ బ్యూటీతో రొమాన్స్

యంగ్ బ్యూటీతో రొమాన్స్

ముఖ్యమంత్రిగా నటిస్తున్న మహేష్ బాబు ఈ చిత్రంలో బాలీవుడ్ యంగ్ బ్యూటీ కైరా అద్వానీతో రొమాన్స్ చేయనున్నాడు. ఈ చిత్రానికి కైరా కూడా ఓ ఆకర్షణ.

సరికొత్త ప్రయత్నం

సరికొత్త ప్రయత్నం

మహేష్ బాబు ముఖ్యమంత్రిగా నటిస్తున్నాడు. అంటే రాజకీయ నాయకుడు. రాజకీయ నాయకుడు అంటే ప్రసంగాలు ఎక్కువగా ఉంటాయి. దీనిని దృష్టిలో ఉంచుకున్న మహేష్ డబ్బింగ్ లో సరికొత్త పంథాని అవలంభించాలని భావిస్తున్నాడు.

డబ్బింగ్ కోసమే సపరేటుగా

డబ్బింగ్ కోసమే సపరేటుగా

ఈ చిత్ర డబ్బింగ్ కోసమే ప్రత్యేకంగా షెడ్యూల్ ని ఏర్పాటు చేయనున్నారట. ఈ షెడ్యూల్ లో మహేష్ తో పాటు నటీనటులంతా డబ్బింగ్ లో పాల్గొంటారని సమాచారం. మహేష్ రాజకీయ నాయకుడిగా ఈ చిత్రంలో కొత్త యాసని ట్రై చేస్తునట్లు తెలుస్తోంది.

త్వరలోనే మొదలు

త్వరలోనే మొదలు

ఈ డబ్బింగ్ షెడ్యూల్ త్వరలోనే మొదలు కాబోతున్నట్లు తెలుస్తోంది. రాజకీయ నాయకులు ప్రజలని ఉద్దేశించి ఎలా మాట్లాడతారు, ఎలాంటి పదాలు ఉపయోగిస్తారు అనే అంశాలపై చిత్రయూనిట్ లోతుగా చర్చించినట్లు తెలుస్తోంది. మహేష్ డైలాగుల్లోని సౌండింగ్ అదిరిపోయేలా ఉండాలనేది ప్లాన్.

మండు వేసవిలో ప్రమాణ స్వీకారం

మండు వేసవిలో ప్రమాణ స్వీకారం

మహేష్ బాబు పూర్తి ప్రమాణ స్వీకారం వినాలంటే ఏప్రిల్ 26 వరకు ఆగాల్సిందే. వేసవి కానుకగా ఆ రోజున భరత్ అనే నేను చిత్రం విడుదల కాబోతోంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. డివివి దానయ్య ఈ చిత్తాన్ని నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X