twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సార్ మీరు టెర్రిఫిక్: మహేష్ బాబు ట్వీట్ హాట్ టాపిక్!

    |

    వెంక‌టేశ్‌, వ‌రుణ్ తేజ్, త‌మ‌న్నా, మెహ‌రీన్ హీరో హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఎఫ్ 2-ఫ‌న్ అండ్ ఫ్ర‌స్టేష‌న్'. సంక్రాంతికి సినిమా విడుదలవుతుండగా తాజాగా వెంకీ పుట్టినరోజు సందర్భంగా టీజర్ రిలీజ్ చేశారు.

    టీజర్ సూపర్ కామెడీతో అందరినీ నవ్విస్తోంది. అయితే ప్రేక్షకలు మాత్రమే కాదు.... సూపర్ స్టార్ మహేష్ బాబుకు సైతం ఈ టీజర్ బాగా నచ్చింది. టీజర్ చూసిన వెంటనే ఆయన ట్విట్టర్ ద్వారా తన స్పందన వ్యక్తం చేశారు.

    సార్ మీరు టెర్రిఫిక్

    ఎఫ్ 2 టీజర్ చూశాను. చాలా వినోదాత్మకంగా ఉంది. వెంకీ సర్ పెర్ఫార్మెన్స్ టెర్రిఫిక్. చిత్ర బృందానికి నా అభినందనలు. హ్యాపీ బర్త్ డే సర్.... అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశారు.

    రెస్పాన్స్ అదిరిపోయింది

    రెస్పాన్స్ అదిరిపోయింది

    ‘ఎఫ్ 2' టీజర్ బుధవారం సాయంత్రం విడుదల చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. 24 గంటల్లోపే 3.5 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. టీజర్‌కు వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే ఓపెనింగ్స్ అదరగొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

    ఈ పండక్కి గట్టిగా నవ్వించేలా ఉన్నారే

    ఈ పండక్కి గట్టిగా నవ్వించేలా ఉన్నారే

    వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ కావడం... పూర్తి వినోదాత్మకంగా సాగే ఫ్యామిలీ ఎంటర్టెనర్ కావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ పండక్క ఇద్దరూ కలిసి గట్టిగా నవ్వించడం ఖాయం అనే అభిప్రాయాలు టీజర్ చూసిన ప్రేక్షకుల నుంచి వ్యక్తం అవుతోంది.

    తమన్నా, మెహ్రీన్

    తమన్నా, మెహ్రీన్

    ఈ చిత్రంలో వెంక‌టేష్ సరసన తమన్నా, వ‌రుణ్‌తేజ్‌కు జోడీగా మెహ్రీన్ నటిస్తోంది. మొగుడు, పెళ్లాల మధ్య జరిగే గిల్లి గజ్జాలకు కామెడీ జోడించి తెరకెక్కించిన చిత్రమిది. ఇందులో వెంకీ, వరుణ్ తేజ్ భార్యలు పెట్టే టార్చర్ భరించలేక సతమతం అయ్యే భర్తలుగా కనిపించబోతున్నారు.

    English summary
    "Watched the teaser of F2!! Looks super fun & entertaining... Venky sir is just terrific. Best wishes to the entire team. Happy birthday sir!!! Have an amazing one... :)" Mahesh Babu tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X