నీకు ఉన్నదంతా ఇచ్చేయ్.. ఇదొక్కటి చాలు ఎనర్జీ వస్తుంది.. మామఅల్లుళ్ల ట్వీట్లు వైరల్
సూపర్‌స్టార్ ఫ్యామిలీ నుంచి ఈ రోజు ఓ కొత్త హీరో దిగాడు. మహేష్ బాబుకు స్వయానా మేనల్లుడు, ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ తెరంగేట్రం చేశాడు. టాలీవుడ్ ఎంట్రీ అనేది ఎప్పుడో జరగాల్సి ఉన్నా.. కొన్ని కారణాలతో ఆలస్యమవుతూ వచ్చింది. అయితే చివరకు అశోక్ ఎదురుచూసిన ఆ తరుణం వచ్చేసింది. ఎట్టకేలకు తన కలను నిజం చేసుకుంటూ చిత్రాన్ని ప్రారంభించేశాడు.

కొత్త బ్యానర్‌పై..
అమర్‌రాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని పద్మావతి గల్లా నిర్మించనున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో అమర్‌రాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ లోగోను ఆవిష్కరించారు.

స్పెషల్ అట్రాక్షన్‌గా రామ్ చరణ్..
సూపర్ స్టార్, మెగా పవర్ స్టార్‌కు సత్సంబంధాలున్న సంగతి తెలిసిందే. ఇరువురు కుటుంబాలు కలిసి ప్రైవేట్ పార్టీలు కూడా చేసుకుంటారు. అంతటి స్నేహం వీరిద్దరి మధ్య ఉండటంతో మహేష్ మేనల్లుడు సినిమా ప్రారంభోత్సవానికి రామ్ చరణ్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఈ కార్యక్రమంలో రానా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.

గౌరవ దర్శకత్వం వహించిన కృష్ణ
సినిమా ముహూర్తపు సన్నివేశానికి రామ్‌చరణ్ క్లాప్ ఇవ్వగా రానా దగ్గుబాటి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ముహూర్తపు సన్నివేశానికి సూపర్‌స్టార్ కృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు. డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్యకు సూపర్‌స్టార్ కృష్ణ, గల్లా అరుణకుమారి, పద్మావతి గల్లా, జయదేవ్ గల్లా స్క్రిప్ట్‌ను అందించారు.
నీకున్నదంతా ఇచ్చేయ్..
తన మేనల్లుడు చిత్ర ప్రారంభోత్సవానికి రాలేకపోయిన మహేష్ బాబు సోషల్ మీడియా వేదిక ఆల్ ది బెస్ట్ చెప్పాడు. కష్టపడు.. నీకున్నదంతా ఇచ్చేయ్.. సక్సెస్ దానతంటదే వచ్చేస్తుంది.. చిత్రబృందానికి గుడ్ లక్ అని ట్వీట్ చేశాడు. సరిలేరు నీకెవ్వరు చిత్ర షూటింగ్ కోసమై మహేష్.. కేరళలో ఉండటంతో ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయాడన్న సంగతి తెలిసిందే.

ఇదొక్కటి చాలు ఎనర్జీ వచ్చేస్తుంది
మహేష్ ట్వీట్‌కు గల్లా అశోక్ స్పందిస్తూ.. నేను ఫాలో కావడానికి కేవలం నాకు మాత్రమే ఉన్న బెస్ట్ రోల్ మోడల్..థ్యాంక్స్ మహేష్ మామయ్య.. ఇది నాకు కావాల్సిన ఎనర్జీని ఇస్తుందని మహేష్ ట్వీట్‌ను ట్యాగ్ చేశాడు. ఈ చిత్రంలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.


Click it and Unblock the Notifications











