భేల్‌పురి ఇష్టపడ్డాడు: కొడుకు గురించి మహేష్ ట్వీట్

By Bojja Kumar

హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతం కృష్ణ నిన్న (ఆగస్టు 31)న పుట్టినరోజు వేడుక జరుపుకున్న సంగతి తెలిసిందే. ఏదైనా ప్రత్యేక సందర్భం ఉంటే తప్ప ట్విట్టర్లో ఎలాంటి ట్వీట్స్ చేయని మహేష్ బాబు.... తన కొడుకు పుట్టినరోజు సందర్భంగా ట్వీట్ చేసారు.

'నా కొడుకు ఈ రోజుతో 8వ వసంతంలోకి అడుగు పెడుతున్నాడు. మీ ప్రేమ, ఆశీర్వాదాలు చూపుతున్నందుకు ధాంక్స్. ఆగడు సినిమాలోని ఆడియో ట్రాక్స్‌లో 'భేల్‌పురి' సాంగ్ గౌతం ఫేవరెట్ అయిపోయింది. మళ్లీ మళ్లీ అదే పాట వింటూ చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. థమన్‌కు థాంక్స్' అంటూ ట్వీట్ చేసారు.

Mahesh Babu tweet about his son

మహేష్ బాబు-నమ్రత శిరోద్కర్ దంపతులకు ఆగస్టు 31, 2006న గౌతం కృష్ణ జన్మించాడు. మమేష్ బాబు నటించిన '1(నేనొక్కడినే)' చిత్రం ద్వారా గౌతం కృష్ణ తెరంగ్రేటం చేసిన విషయం తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా మహేష్ బాబు సినిమారంగంలోకి ప్రవేశిస్తే....మహేష్ బాబు నట వారసుడిగా గౌతం కృష్ణ తెరంగ్రేటం చేసారు. మహేష్ బాబు తన తండ్రి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా చేసినట్లే, గౌతం కూడా తన తండ్రి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా వెండి తెరకు పరిచయం కావడం గమనార్హం.

'ఆగడు' సినిమా విషయానికొస్తే....ఈ చిత్రానికి శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. మహేష్ బాబు సరసన తమన్నా హీరోయిన్. థమన్ సంగీతం అందించారు. ఆగస్టు 30న సినిమా ఆడియోను విడుదల చేసారు. ఆడియోకు మంచి స్పందన వస్తోంది. త్వరలో సినిమాను విడుదల చేయనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X