భార్యను మర్చిపోయానంటూ మహేష్ బాబు
మహేష్ బాబు తాజాగా ట్వీట్ చేస్తూ...మీరు నమ్ముతారో లేదో...నేను నా హడావిడిలో బిజీగా ఉండి...నేను నా భార్య పుట్టిన రోజుని మర్చిపోయాను...చాలా టెర్రబుల్...ఆమెకు ఇప్పుడు చెప్తున్నా భర్తడే విషెష్. హ్యాపియిస్ట్ బర్త్ డే ఎవర్...మీ కందరికీ ధాంక్స్...మీ అందరి ప్రేమకు..నా అబినందనలు...బిజినెస్ మ్యాన్ సినిమా బిజినెస్ కంటిన్యూ అవుతోంది అన్నారు. ఇక క్రిందట వారం విడుదలైన బిజినెస్ మ్యాన్ చిత్రం రికార్డు కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. కాజల్ హీరోయిన్ గా చేసిన ఈ చిత్రం రికార్డు కలెక్షన్స్ కురిపిస్తోంది. ఈ చిత్రం తర్వాత ప్రస్తుతం మహేష్ బాబు...సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో చేస్తున్నారు. ఆ తర్వాత సుకుమార్ డైరక్షన్ లో రెడీ అవుతున్న చిత్రం చేస్తున్నారు.
ఇక దూకుడు,బిజినెస్ మ్యాన్ వరస విజయాలతో మహేష్ ఇప్పుడు హాట్ స్టార్ గా మారారు. దాంతో ఇప్పుడాయిన రెమ్యునేషన్ కూడా బాగా పెరిగిందని అంతర్గత వర్గాల సమాచారం. సినిమాకు తొమ్మిది కోట్లు రెమ్యునేషన్ అని,ఓవర్ సీస్ రైట్స్ లో పిప్టీ పర్శంట్ షేర్ అని చెప్తున్నారు. ఎందుకంటే ఓవర్ సీస్ మార్కెట్ లో ఇప్పుడు మహేష్ నెంబర్ వన్ గా ఉన్నారు. నైజాం షేర్ తో సమానంగా ఓవర్ సీస్ లో కూడా వసూళ్లు వస్తున్నాయి. ఇక మహేష్ మీద ఇప్పుడు పెట్టుబడి పెట్టడానికి నిర్మాతలంతా ఆసక్తి చూపిస్తున్నారు. బిజినెస్ మ్యాన్ బిజినెస్ అందరినీ ఎట్రాక్ట్ చేస్తోంది.
మహేష్ బాబు డేట్స్ ఉంటే చాలు ఫైనాన్సియర్స్ ఎంతైనా పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. దాంతో ప్రతీ ఒక్క నిర్మత తమదైన శైలిలో మహేష్ ని పట్టుకోవటానికి డైరక్టర్స్ ద్వారా కాంబినేషన్స్ సెట్ చేయటానికి ప్రయత్నిస్తున్నారు. మహేష్ కూడా వరసగా సినిమాలు ఒప్పుకోవటంతో వారిని ఉత్సాహపరుస్తోంది. గతంలోలాగ మూడేళ్లు పాటు సినిమాలు చెయ్యకండా మహేష్ తన తండ్రి కృష్ణగారిలా వరస సినిమాలతో ముందుకెళ్లటంతో అందరూ మహేష్ డేట్స్ కోసమే ట్రై చేస్తున్నారు. ఈ నేపధ్యంలో మహేష్ తన రేటుని ఇంకా పెంచినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు.


Click it and Unblock the Notifications











