లవ్ యు ఆల్... అంటూ మహేష్ బాబు ట్వీట్
హైదరాబాద్: మహేష్ బాబు నటించిన ‘శ్రీమంతుడు' మూవీ బాక్సాఫీసు వద్ద రూ. 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మహేష్ బాబు తన ట్విట్టర్ ద్వారా ఆనందం వ్యక్తం చేసారు. ‘థాంకింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ యువర్ అన్ కండీషనల్ లవ్ అండ్ సపోర్ట్. లవ్ యు ఆల్' అంటూ ట్వీట్ చేసారు.
మహేష్ బాబు, శృతిహాసన్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శ్రీమంతుడు'. మైత్రి మూవీ మేకర్స్, ఎం.బి.ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లి. బ్యానర్స్‌పై తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 7న విడుదలై హిట్ టాక్‌తో వెళ్తోంది. ఈ సినిమా థియేటర్స్ లో విజయవంతంగా నడుస్తూ నిన్న శుక్రవారంతో 50 రోజులను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.

జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, అలీ, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, శివాజీ రాజా, కాదంబరి, ముకేష్ రుషి, సంపత్, హరీష్, ఏడిద శ్రీరాం, తులసి, సుకన్య, సీతారాం, సన ఇతర తారాగణం. ఈ చిత్రానికి పాటలు: రామజోగయ్యశాస్త్రి, డ్యాన్స్: రాజుసుందరం, దినేష్, బాస్కో సీజర్, థ్రిల్స్: అనల్ అరసు, అసిస్టెంట్ డైరెక్టర్స్: త్రివేది, అసోసియేట్ డైరెక్టర్స్: శేషు, జయరాం రవి, కో డైరెక్టర్స్: వాసు, తులసి, చీఫ్ కో డైరెక్టర్స్: పి.వి.వి. సోమరాజు, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్: ఎ.యస్.ప్రకాష్, కెమెరా: మది, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చంద్రశేఖర్ రావిపాటి, నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ (సి.వి.ఎమ్), కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: కొరటాల శివ.


Click it and Unblock the Notifications











