'సీతమ్మవాకిట్లో...' ఫస్ట్ లుక్ పై మహేష్ కామెంట్
మహేష్ తాజా చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఫస్ట్ లుక్ ట్రైలర్ కృష్ణ పుట్టిన రోజును పురస్కరించుకుని రెండు రోజుల క్రితం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ విడుదల అయిన కాస్సేపటికే రెండు లక్షలకు పైగా యూ ట్యూబ్ లో చూసారు. అలాగే ఫేస్ బుక్ లో సైతం పదివేల కు పైగా మెంబర్స్ షేర్ చేసుకున్నారని అంచనా. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ ట్రైలర్ పై మహేష్ బాబు తన ట్విట్టర్ లో స్పందించారు.
మహేష్ ట్వీట్ చేస్తూ...'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'కి సూపర్బ్ రెస్పాన్స్..అందరికీ కృతజ్ఠతలు. పండగ రోజు కోసం ఎదురుచూస్తున్నాను అని ట్వీట్ చేసారు. అలాగే తన తండ్రి పుట్టిన రోజు ను పురస్కరించుకుని చేసిన ట్వీట్ లో...నా ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ నాన్నకి పుట్టిన రోజు శుభాకాంక్షలు అని ట్వీట్ చేసారు. ఇక ఈ ట్రైలర్లోనే సినిమా పూర్తి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని స్పష్టం అయ్యేలా చేయటం మహేష్ కి ఆనందం కలిగించిందని చెప్తున్నారు.
'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో మహేష్, వెంకటేష్, ప్రకాశ్ రాజ్, సమంత, అంజలిలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మిక్కి జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" చిత్రం ఈ దసరాకి విడుదల కానుంది. మహేష్ బాబు అభిమాన కెమెరామెన్ గుహన్ ఈ చిత్రానికి కెమెరా అందించనున్నారు. గుహన్ ఇంతకుముందు అతడు, దూకుడు చిత్రాలకు ఛాయాగ్రహణం అందించారు.
ఈ చిత్రం గురించి దిల్ రాజు మాట్లుడుతూ...అన్న కోసం తమ్ముడు అడవులకు వెళ్లితే అది రామాయణం. ఆస్తి కోసం అన్నదమ్ములు తగువుకి దిగితే... అది నేటి భారతం. రక్తం ఎప్పుడైతే పంచుకొని పుట్టారో, అప్పటి నుంచి పంపకాలు అలవాటైపోయాయి. 'అమ్మను నువ్వు చూసుకో - నాన్న నా దగ్గర ఉంటాడు. లేదంటే ఇద్దర్నీ చెరో ఆరు నెలలూ భరిద్దాం' - ఇలాంటి లెక్కలు వింటూనే ఉన్నాం. అందుకే ఉమ్మడి కుటుంబం ముక్కలైపోయింది. ఈ రోజుల్లోనూ ఆస్తుల్ని కాకుండా అనుబంధాల్నీ ఆప్యాయతల్నీ పంచుకొనే సోదరుల్ని మా చిత్రంలో చూపిస్తున్నామన్నారు.


Click it and Unblock the Notifications











