పూరీ గురించి ఎమోషనల్ గా మహేష్ ట్వీట్
చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ట్వీట్ చేసారు. ఆయన ట్వీట్ లో ఈ సంక్రాంతి తనకు బాగా కలిసివచ్చిందన్నారు. అంతేగాక బిజినెస్ మ్యాన్ చిత్రం ఇంత సెన్సేషనల్ హిట్ చేసినందుకు అందరికీ ధాంక్స్ చెప్పారు. స్టన్నింగ్ ఓపినింగ్స్,నాకొచ్చే కాంప్లిమెంట్స్ చూస్తూంటే చాలా ఆనందంగా ఉంది అన్నారు. ఇక జగన్ గారు నాకు పోకిరితో సూపర్ స్టార్ డమ్ ఇచ్చారు. బిజినెస్ మ్యాన్ తో నన్ను ఆయన నటుడుగా మరో లెవిల్ కి తీసుకెళ్లారు. ధాంక్యూ సార్ ...నేను మీకెప్పుడూ రుణపడి ఉంటాను అన్నారు.
అలాగే ఆర్.ఆర్.వెంకట్ గారికి,యూనిట్ సభ్యులందరికీ ధాంక్స్. క్రితం సంవత్సరం సెప్టెంబర్ 23 నుంచి ఇప్పటివరకూ నాకు పండగవాతావరణం కొనసాగుతూనే ఉంది. ఇలాంటి మెమరబుల్ ఫెస్టివల్ ఇచ్చిన మీ అందరకీ మరో సారి నా కృతజ్ఞతలు అంటూ చాలా ఎమోషనల్ గా ట్వీట్ చేసారు. ఇక బిజినెస్ మ్యాన్ చిత్రం ఈ సంక్రాంతికి పెద్ద హిట్ గా నిలిచింది. కలెక్షన్స్ పరంగా పెద్ద సంచలనమే అంటున్నారు. మహేష్,పూరి కాంబినేషన్ లో వచ్చిన పోకిరి ని దాటేస్తుందని చెప్తున్నారు. క్యారక్టరైజేషన్,డైలాగులు మీద డిపెండయి తీసిన ఈ చిత్రం యువతకు బాగా నచ్చుతోంది. భాయ్ అవుదామని ముంబై వెళ్ళిన ఓ యువకుడి కథే బిజినెస్ మ్యాన్.


Click it and Unblock the Notifications











