'బిజినెస్ మేన్' గురించి మహేష్ తాజా ట్వీట్
తను తదుపరి చిత్రం 'బిజినెస్ మేన్' గురించి మహేష్ బాబు తాజాగా ట్వీట్ చేసారు.నన్ను ఇష్టపడేవారందికి శుభవార్త. ది బిజినెస్ మ్యాన్ సినిమా రేపు ప్రారంభం కానుంది.నా కెరీర్స్త లో ఇది మరో మైలు రాయి అవుతుందని భావిస్తున్నాను. నా రాక్ స్టార్ డైరక్టర్ పూరీ జగన్నాధ్ కి బిగ్ ధాంక్స్. గౌతమ్ కి బ్లెస్సింగ్స్ ఇచ్చిన మీ అందరికి కూడా నా ధాంక్స్. దూకుడు నుంచి వచ్చేసాను. దూకుడు గురించి మాట్లాడాలని ఉంది. రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాను.వినాయిక చవతి,రంజాన్ శుభాకాంక్షలు మీ అందరికి అన్నారు. ఇక హీరోయిన్ గా కాజల్ ఈ చిత్రంలో మహేష్ సరసన చేయనుంది.ముంబై నేపథ్యంలోసాగే మాఫియా కథ 'ది బిజినెస్‌మ్యాన్'. ఇంతవరకూ మహేష్ బాబు చేయనటువంటి పాత్ర ఇది. 'బిజినెస్‌మ్యాన్'గా టైటిల్‌కు తగిన పాత్ర అది. పోకిరి తర్వాత అంతటి హిట్ ఇవ్వాలని పట్టుదలతో ఉన్నాం అంటున్నారు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్. ఆర్.ఆర్.మూవీస్ పతాకంపై ఆయన రూపొందించబోయే చిత్రం గురించి మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. రీసెంట్ గానే ఈ చిత్రం ఓపినింగ్ జరిగింది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని అందివ్వాలని దర్శక,నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.ఈ చిత్రానికి సంగీతం: థమన్, ఛాయాగ్రహణం: శ్యామ్.కె.నాయుడు, కళ: చిన్నా, ఫైట్స్: విజయ్, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, సహనిర్మాత: వి.సురేష్‌రెడ్డి, నిర్మాత: డా.వెంకట్, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు- దర్శకత్వం: పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











