రాంచరణ్, సమంత అదుర్స్ అంతే.. రంగస్థలంపై వైరల్‌గా మారిన మహేష్ కామెంట్స్!

Recommended Video

Mahesh Babu Tweets On Rangasthalam

మెగా పవర్ స్టార్ రాంచరణ్, సమంత జంటగా నటించిన చిత్రం రంగస్థలం. రంగస్థలం చిత్రం టాలీవుడ్ రికార్డులన్నింటిని తుడిచిపెట్టేస్తూ బాహుబలి తరువాత అత్యథిక గ్రాస్ వసూలు చేసిన చిత్రంగా అవతరించింది. ఇప్పటికీ రంగస్థలం చిత్ర వసూళ్లు సూపర్ స్ట్రాంగ్ గా కొనసాగుతున్నాయి. రంగస్థలం చిత్రంలో రాంచరణ్ నటనకు ప్రశంసలు దక్కుతున్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వ ప్రతిభకు కూడా అందరి నుంచి అభినందనలు దక్కుతున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్, రానా, వెంకటేష్ వంటి స్టార్ హీరోలంతా రంగస్థలం చిత్రంపై ప్రశంసలు కురిపించారు. ఆ జాబితాలోకి తాజాగా మహేష్ బాబు కూడా చేరాడు.

బాహుబలి తరువాత రంగస్థలమే

బాహుబలి తరువాత రంగస్థలమే

అత్యధిక గ్రాస్ వసూలు చేసిన తెలుగు చిత్రాల్లో రంగస్థలం చిత్రం బాహుబలి తరువాతి స్థానంలో నిలిచింది. వారం దాటాక కూడా ఈ చిత్రానికి బలమైన కలెక్షన్లు వస్తున్నాయి. రెండవ వీకెండ్ లో ఇంకాస్త పుంజుకుంటే 100 కోట్ల షేర్ సాధ్యం అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

రాంచరణ్ అద్భుత నటన

రాంచరణ్ అద్భుత నటన

ఈ చిత్రంలో చిట్టిబాబుగా రాంచరణ్ కనబరిచిన నటన అమోఘం. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో రాంచరణ్ నటించిన తీరు ప్రతి ప్రేక్షకుడి హృదయాన్ని కదిలించింది.

ప్రముఖుల ప్రశంసలు

ప్రముఖుల ప్రశంసలు

రంగస్థలం చిత్రం రాంచరణ్ కెరీర్ లో నటన పరంగా, వసూళ్ల పరంగా ది బెస్ట్ మూవీ గా నిలిచింది. చరణ్ నటనపై ఎన్టీఆర్, రానా, వెంకటేష్ వంటి స్టార్ హీరోలు ప్రశంసలు కురిపించారు.

సమంత, రాంచరణ్ గురించి మహేష్ ఇలా

తాజా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా రంగస్థలం చిత్ర యూనిట్ ని అభినందించాడు. ట్విటర్ వేదికగా స్పందించిన మహేష్ బాబు రంగస్థలం రాంచరణ్, సమంతపై ప్రశంసలు కురిపించాడు. రాంచరణ్, సమంత అద్భుతమైన నటన కనబరిచారని మహేష్ బాబు అన్నారు.

సుకుమార్ నిజంగా మాస్టర్

రంగస్థలం చిత్రాన్ని ఉత్కంఠ భరితంగా తెరకెక్కించడంలో సుకుమార్ అద్భుత విజయం సాధించారని మహేష్ ప్రశంసించాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, రత్నవేలు సినిమా టోగ్రఫీ అద్భుతంగా ఉన్నాయని మహేష్ తెలిపాడు. తాను ఈ చిత్రాన్ని పూర్తిగా ఎంజాయ్ చేసిన విషయాన్ని కూడా మహేష్ ప్రస్తావించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X