పవన్ కళ్యాణ్ స్నేహం కోసం మహేష్ బాబు త్యాగం....
మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రెడీ అవుతున్న చిత్రం ఆగస్టులో విడుదల చేయనున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో మహేష్ బాబు చిన్న ట్విస్ట్ ఇచ్చారని తెలుస్తోంది. రెండేళ్లుగా మహేష్ బాబు సినిమా విడుదల కాక కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అయితే, మహేష్ బాబు తన తాజా చిత్రాన్ని అక్టోబర్ లో రిలీజ్ చేయాలంటూ నిర్మాతను కోరినట్లు తెలుస్తోంది. దీనికి కారణం పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'కొమరం పులి" ఆగస్టు, సెప్టెంబర్ లలో రిలీజ్ అవుతుండటంతో క్లాష్ రాకుండా మహేష్ బాబు తన సినిమాని వాయిదా వేయడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
ఈ నిర్ణయం వెనుక మహేష్ బాబు వ్యక్తిగత కారణాలతో పాటు సినిమా ప్రయోజనాలు, నిర్మాత ప్రయోజనాలు, పవన్ కళ్యాణ్ తో స్నేహం లాంటి అనేక అంశాలు ఉన్నాయని మహేష్ సన్నిహితులు చెబుతున్నారు. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ మంచి ఫ్రెండ్స్ అని, అందుకే 'పులి" కోసం మహేష్ బాబు తన సినిమా వాయిదా వేసుకున్నారన్నది ఒక వాదన. అలాగే, పవన్ తదుపరి చిత్రం లవ్ ఆజ్ కల్ చిత్రం తెలుగు రీమేక్ కి త్రివిక్రమ్ డైలాగ్స్ రాస్తున్నారు. దీనికి తోడు పవన్ కళ్యాణ్ జల్సా చిత్రానికి మహేష్ బాబు వాయిస్ ఓవర్ అందించారు కూడా. ఇవన్నీ ఒక ఎత్తయితే పులి, మహేష్ -త్రివిక్రమ్ చిత్రాలు రెండిటికీ నిర్మాత సింగనమల రమేష్ కావడంతో తన రెండు చిత్రాలు ఒక దానితో ఒకటి పోటీ పడకుండా మహేష్ చిత్రాన్ని వాయిదా వేయాలని నిర్ణయించారు.


Click it and Unblock the Notifications











