»   » మహేష్ బాబు ట్విట్టర్‌ను హ్యాక్ చేసి తప్పు వ్యాఖ్యలు

మహేష్ బాబు ట్విట్టర్‌ను హ్యాక్ చేసి తప్పు వ్యాఖ్యలు

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : ట్విట్టర్లో అత్యధిక మంది ఫాలోవర్స్‌తో కొనసాగుతున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అకౌంట్‌ను ఎవరో హ్యాక్ చేసారు. మహేష్ బాబు గురించి, ఆయన సినిమాల గురించి తప్పుడు వ్యాఖ్యలు చేసారు. అయితే ఈ విషయం గమనించిన మహేష్ వెంటనే పాస్ వర్డ్ మార్చేసారు.

తన అకౌంట్ హ్యాక్ అయిన విషయాన్ని మహేష్ బాబు తాజా ట్వీట్ ద్వారా వెల్లడించారు. 'Just got calls2 know someone walked in2 my account..sorry guys. It's not me .. done the usual, changed d password..goodnight' అంటూ ట్వీట్ చేసారు.

మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే...ప్రస్తుతం ఆయన సుకుమార్ దర్శకత్వంలో '1'(నేనొక్కడినే) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కృతి సానన్ హీరోయిన్. ఇటీవల విడుదలైన '1' టీజర్ కు మంచి స్పందన వచ్చింది. ఇప్పటికే 1 మిలియన్‌పై హిట్స్ వచ్చి సంచలనం సృష్టించింది.

ఈ చిత్ర నెక్ట్స్ షూటింగ్....ఈ నెల 18 నుంచి నార్తన్ ఐర్లాండ్(బెల్ ఫాస్ట్), లండన్, యుకెలో 60 రోజుల పాటు ఏకధాటిగా భారీ షెడ్యూల్ జరుగుతుంది. ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ : రత్నవేలు, సంగీతం : దేవిశ్రీప్రసాద్, కళ : రాజీవన్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఫర్వేజ్ ఫిరోజ్, కెచ్చా, ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కోటి పరుచూరి, నిర్మాతలు : రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : సుకుమార్.

English summary
"Just got calls2 know someone walked in2 my account..sorry guys. It's not me .. done the usual, changed d password..goodnight" Mahesh Babu tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu