మహేష్ బాబు ‘ట్విట్టర్’ రికార్డ్
హైదరాబాద్ : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరో రికార్డు నమోదు చేశాడు. మన రాష్ట్రంలోనే కాకుండా దేశ విదేశాల్లో అభిమానులను సొంతం చేసుకున్న మహేష్ బాబు ట్విట్టర్లో మరో మైలు రాయిని దాటాడు. ఆయన్ను ఫోలో చేస్తున్న అభిమానుల సంఖ్య 6 లక్షల సంఖ్యను దాటింది.
తెలుగు హీరోల్లో మహేష్ బాబుకు తప్ప ఈ రేంజ్ లో ఎవరికీ ట్విట్టర్ ఫాలోవర్స్ లేరు. ఇటీవల విడుదలైన మహేష్ బాబు సినిమాలు వరుసగా భారీ విజయం సాధించడం వల్ల మహేష్ బాబు అభిమానుల సంఖ్య మరింత పెరిగిందని, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లోని సినీ ప్రేమికులు కూడా ఆయన అభిమానుల లిస్టులో చేరారని అంటున్నారు.
ప్రస్తుతం మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న '1'(నేనొక్కడినే) చిత్రంలో నటిస్తున్నారు. బెల్ ఫాస్ట్, నార్తర్న్ ఐర్లాండ్‌లలో పూర్తి చేసుకుని తాజాగా లండన్ నగరానికి షిప్టయింది. యూనిట్ సభ్యుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం జులై 20 వరకు ఇక్కడ షూటింగ్ జరుపుతారని తెలుస్తోంది.
ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ : రత్నవేలు, సంగీతం : దేవిశ్రీప్రసాద్, కళ : రాజీవన్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఫర్వేజ్ ఫిరోజ్, కెచ్చా, ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కోటి పరుచూరి, నిర్మాతలు : రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : సుకుమార్.


Click it and Unblock the Notifications












