మహేష్ బాబు బంధువు, పద్మాలయ రాంబాబు అకాల మరణం
మహేష్ బాబు కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. మహేష్ బాబుకు మామయ్య వరుస అయ్యే శాఖమూరి రాంబాబు అలియాస్ పద్మాలయ రాంబాబు అకాల మరణం చెందారు. మహేష్ ఫ్యామిలీకి చెందిన పద్మాలయ స్టూడియోకు సంబంధించిన వ్యవహారాలు కొన్నేళ్లుగా ఆయనే చూసుకుంటున్నారు.

పద్మాలయ రాంబాబుగా...
కొన్నేళ్లుగా పద్మాలయ స్టూడియోస్ వ్యవహారాలు రాంబాబు చూసుకుంటున్నారు. స్టూడియో అభ్యున్నతికి ఆయన ఎంతగానో తోడ్పడ్డారని చెబుతుంటారు. ఆయన పేరు శాఖమూరి రాంబాబు అయినప్పటికీ ఇండస్ట్రీలో అందరూ ఆయన్ను పద్మాలయ రాంబాబు అని పిలుస్తుంటారు.

నిర్మాతగా రమేష్ బాబుతో మూవీ
ఒకప్పుడు మహేష్ బాబుకు ఆయన పర్సనల్ మేనేజర్‌గా కూడా రాంబాబు వ్యవహరించారు. మహేష్ సోదరుడు రమేష్ బాబుతో గతంలో ఓ చిత్రాన్ని కూడా ఆయన నిర్మించారు.

ఘట్టమనేని కుటుంబంలో విషాదం
రాంబాబు మరణంతో ఘట్టమనేని కుటుంబంలో విషాదం నెలకొంది. ఘట్టమనేని అభిమానులు ఆయన మరణంపై విచారం వ్యక్తం చేస్తున్నారు.

సినీ పరిశ్రమ సంతాపం
పద్మాలయ రాంబాబు మరణంపై పలువురు సినీ ప్రముకులు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications











