మా కుటుంబ సభ్యుడి లాంటివాడు అందుకే...మహేష్ బాబు
''బి.ఎ.రాజు మా కుటుంబ సభ్యుడి లాంటివాడు. సాధారణంగా ఇలాంటి వేడుకలకు ఎక్కువగా హాజరుకాని నేను ఈ వేడుకకు రావడానికి కారణం అదే. ఆయన నిర్మిస్తున్న ఈ చిత్రం మంచి విజయం సాధించాలి'' అన్నారు మహేష్ బాబు. 'ప్రేమకావాలి' ఫేం ఆది, శాన్వీ జంటగా బి.జయ దర్శకత్వంలో బి.ఎ.రాజు నిర్మిస్తున్న చిత్రం 'లవ్‌లీ'. ఆది, శాన్వి జంటగా నటించిన చిత్రం 'లవ్‌లీ'. బి.జయ దర్శకత్వం వహించారు. బి.ఎ.రాజు నిర్మాత. మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో ఈ చిత్రంలోని పాటలు విడుదలయ్యాయి. తొలి సీడీని మహేష్‌బాబు ఆవిష్కరించారు. శ్రీనువైట్ల స్వీకరించారు. ప్రకటన చిత్రాన్ని కె.అచ్చిరెడ్డి విడుదల చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహేష్‌బాబు మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే ...''నాకు సాయికుమార్ అంటే ఇష్టం. ఆయన నటించిన సినిమాలు ఎక్కువగా చూస్తాను. ఆదికి ఈ చిత్రం మరో విజయాన్ని చేకూర్చాలని ఆశిస్తున్నాను. అనూప్ పాటలు కొత్తగా ఉన్నాయి. వందశాతం సక్సెస్ ఉన్న సంస్థ ఆర్.ఆర్.మూవీమేకర్స్. ఆ సంస్థ సమర్పిస్తున్న ఈ చిత్రమంటే తప్పకుండా జనానికి మెచ్చే అంశాలు ఉండివుంటాయి. ఈ సినిమా ఆదికి మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను'' అని మహేష్‌బాబు అన్నారు.
కె.అచ్చిరెడ్డి స్పందిస్తూ ''పాటలు వినడానికి ఎంత బాగున్నాయో అంతే చక్కగా తెరకెక్కించారని''అన్నారు. ఇక హీరో ఆది మాట్లాడుతూ.. ''అందరిలాగే నేను కూడా మహేష్‌బాబు అభిమానిని. ఆయన ఈ వేడుకకి వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు ఆనందంగా ఉంది''అన్నారు. ''మహేష్‌బాబుని దృష్టిలో పెట్టుకునే ఆదిని తీర్చిదిద్దాను. ద్వితీయ విఘ్నం లేకుండా ఆదికి రెండో విజయం అందించే చిత్రమవుతుంది''అన్నారు దర్శకురాలు బి.జయ. ఈ కార్యక్రమంలో పి.జె.శర్మ, సాయికుమార్, కొండా కృష్ణంరాజు, బి.వి.యస్.యన్.ప్రసాద్, బెల్లంకొండ సురేష్, యన్.వి.ప్రసాద్, గోపీచంద్, వి.సురేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆదిత్య ద్వారా పాటలు విడుదలయ్యాయి.


Click it and Unblock the Notifications











