చిరంజీవి గ్రాండ్ ఎంట్రీ: మహేష్ బాబు అలా.. ఉపాసన ఇలా!! ఆ రియాక్షన్ చూస్తే..

మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇకపై సామాజిక మాద్యమాల్లోనూ టచ్‌లో ఉంటూ తన అభిప్రాయాలను పంచుకుంటా అని చెప్పిన చిరంజీవి.. ఇన్స్‌స్టాగ్రామ్, ట్విట్టర్ ఖాతాలను ఓపెన్ చేశారు. దీంతో చిరంజీవి ఎంట్రీని స్వాగతిస్తూ మహేష్ బాబు, ఉపాసన రియాక్ట్ అయ్యారు. ఆ వివరాలేంటో చూద్దామా..

ఉగాది రోజే.. మెగా ఆగమనం

ఉగాది రోజే.. మెగా ఆగమనం

తెలుగు ప్రజలు గొప్పగా, శుభ సూచకంగా భావించే ఉగాది పండగ రోజే సోషల్ మీడియాలో మెగాస్టార్ ఎంట్రీ ఇచ్చారు. అంతేకాదు తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ మొదటి ట్వీట్ చేశారు. తన తోటి భారతీయులందరితో, తెలుగు ప్రజలందరితో అలాగే అత్యంత ప్రియమైన అభిమానులతో నేరుగా ఈ వేదిక నుంచి మాట్లాడగలగటం ఆనందంగా ఉందని పేర్కొన్నారు చిరంజీవి.

మెగా అభిమాన శిబిరాల్లో ఆనందం

మెగా అభిమాన శిబిరాల్లో ఆనందం

@KChiruTweets పేరుతో ట్విటర్, @chiranjeevikonidela పేరుతో ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను ప్రారంభించిన ఆయన ఇకపై నేరుగా అందరితో టచ్‌లో ఉంటూ సామజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటానని తెలిపారు. దీంతో మెగా అభిమాన శిబిరాల్లో ఆనందం వెల్లువిరుస్తోంది.

స్వాగతం అంటూ సినీ తారల స్పందన

స్వాగతం అంటూ సినీ తారల స్పందన

సోషల్ మీడియాలో చిరంజీవి ఎంట్రీని స్వాగతిస్తూ పలువురు సినీ ప్రముఖులు అభినందలు తెలుపుతున్నారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కింగ్ నాగార్జున, రాధిక, సుహాసిని, దర్శక ధీరుడు రాజమౌళి సహా పలువురు ఆయనకు వెల్‌కమ్ చెప్పారు.

 మహేష్ బాబు అలా.. ఉపాసన ఇలా!!

మహేష్ బాబు అలా.. ఉపాసన ఇలా!!

సామాజిక మాద్యమాల్లోకి ఎంటర్ అయిన చిరంజీవి సర్‌కి స్వాగతం అంటూ చిరంజీవి చేసిన మొదటి ట్వీట్‌ని రీ ట్వీట్ చేశారు సూపర్ స్టార్ మహేష్ బాబు. అలాగే మెగా కోడలు ఉపాసన కూడా మామ చిరంజీవి ఎంట్రీకి స్వాగతం పలుకుతూ ట్వీట్ చేసింది. 'మామయ్య.. వెల్‌కమ్ టు ట్విట్టర్' అని ఆమె పేర్కొంది.

24 గంటలలోపే చిరంజీవి ఫాలోవర్ల సంఖ్య..

ఇకపోతే చిరంజీవి ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను ఓ రేంజ్ ఆదరణ లభిస్తోంది. పెద్ద ఎత్తున చిరంజీవిని ఫాలో అవుతున్నారు నెటిజన్లు. రికార్డు స్థాయిలో ఫాలోవర్లు పెరుగుతున్నారు. ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేసిన 24 గంటలలోపే చిరంజీవి ఫాలోవర్ల సంఖ్య లక్ష దాటేయడం విశేషం.

Recommended Video

RRR Motion Poster : Megastar Chiranjeevi, RGV Reacts On RRR Title & RRR Motion Poster
కొరటాలతో చిరంజీవి..

కొరటాలతో చిరంజీవి..

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆచార్య' మూవీతో బిజీ అయ్యారు చిరంజీవి. ఈ సినిమాలో మహేష్ కూడా నటిస్తున్నారనే వార్తలు వచ్చినప్పటికీ చివరకు ఆ రోల్ రామ్ చరణ్ పోషిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం కరోనా కారణంగా ఈ మూవీ షూటింగ్ వాయిదా పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X