ప్రిన్స్ మహేష్ నవ్వుల హంగామా!
అభిమానుల చేత సూపర్ స్టార్ గా కీర్తించబడుతోన్న మహేష్ మరో ఏడాదిలో జీరో స్కోర్ తో సరిపెడుతున్నాడు. 2008 లో ఒక్క సినిమా కూడా చేయని మహేష్, 2009 లో కూడా ఒక్క రిలీజ్ లేకుండా ముగిస్తున్నాడు. 2008 లో అయితే 'జల్సా" చిత్రానికి వాయిస్ ఓవర్ ఇచ్చిన మహేష్ ఈసారి కనిసించనూ లేదు, వినిపించనూ లేదు. తర్వాత నెంబర్ వన్ మావాడేనంటూ అభిమానులు నమ్మకం పెట్టుకున్న తరుణంలో, చిరంజీవి రిటైరయిన తర్వాత సింహాసనం మాదేనని ఆశపడ్డ సమయంలో చిరంజీవి రిటైరైన తర్వాత ఇంతదాకా మహేష్ సినిమానే విడుదల కాలేదు! పోకిరి తో నెలకొల్పిన రికార్డు కూడా ఈ ఏడాది మగధీర తో బ్రేక్ అయిపోవడంతో మళ్లీ రికార్డులు నమోదు చేయడానికి తమ హీరో ఎప్పుడొస్తాడా అని ఫాన్స్ ఎదురుచూపులు చూస్తూనే వుంటే మహేష్ మాత్రం ఎలాంటి తొందర లేకుండా తాపీగా సినిమా చేసుకుంటున్నాడు.
ప్రస్తుతం మహేష్ బాబు, అనుష్క జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంతో ఓ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఇందులో మహేష్ బాబు క్యాబ్ డ్రైవర్ గా నటిస్తున్నాడు. త్రివిక్రమ్ స్టైల్ కామెడీ తో ఈ సినిమాలో మంచి నవ్వించే సన్నివేశాలున్నాయని సమాచారమ్. తర్వాత జనం పల్స్ ను బాగా పట్టుకున్న దర్శకుడు శ్రీను వైట్ల వరుస విజయాలతో సాగిపోతున్నాడు. ప్రస్తుతం ఇతని దర్శకత్వంలో వెంకటేష్, త్రిష జంటగా 'ఓం నమో వెంకటేశాయ" చిత్రం రూపొందిస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత మహేష్ తో కామెడీ చిత్రం తీయబోతున్నట్టు తెలుస్తోంది. ఇదివరకే కొంతవరకూ స్ర్కిప్ట్ వర్క్ కూడా పూర్తయిందట. శ్రీను వైట్ల, మహేష్ కాంబినేషన్ లో చిత్రమొస్తే ఖచ్చితంగా అంచనాలపై ప్రభావం చూపడం తధ్యం. కాబట్టి ఆ సినిమా విడుదలైన తరువాత కానీ మహేష్ తో శ్రీనువైట్ల సినిమావస్తుందో లేదో తెలిసే అవకాశం లేదు.


Click it and Unblock the Notifications











