SSMB28 అప్డేట్ వచ్చేసింది.. ఈసారి టీజర్ కాదు అంతకుమించి కిక్కిచ్చే స్ట్రైక్!
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ అంటే ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో వీళ్లిద్దరూ కలిసి చేసిన 'అతడు', 'ఖలేజా' చిత్రాలు కమర్షియల్‌గా సక్సెస్ కాకున్నా.. మహేశ్ కెరీర్‌లోనే ఇవి బెస్ట్ మూవీస్‌గా నిలిచాయి.
అందుకే వీళ్ల కాంబోలో మరో సినిమా కోసం ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూశారు. ఇలాంటి పరిస్థితుల్లోనే త్రివిక్రమ్ - మహేష్ బాబు కలిసి 12 ఏళ్ల తర్వాత మూడోసారి జత కట్టి ఓ సినిమాను చేస్తోన్నారు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తోన్న సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ ఎప్పుడో మొదలైనా.. అనివార్య కారణాల వల్ల ఇది పలుమార్లు వాయిదా పడింది. దీంతో షూటింగ్ ఆలస్యం అవడంతో సినిమా విడుదలను సంక్రాంతికి వాయిదా వేశారు.
దీనికితోడు ఈ చిత్రం గురించి తరచూ నెగెటివ్ న్యూస్‌లు వైరల్ అవుతోన్నాయి. వీటిపై ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు. దీన్ని పోగొట్టేందుకు చిత్ర యూనిట్ ఇప్పుడు అదిరిపోయే అప్‌డేట్‌తో రాబోతుంది. తాజాగా దీనిపై మరింత సమాచారాన్ని వెల్లడించారు.
క్రేజీ కాంబోలో భారీ హైప్ నడుమ తెరకెక్కుతోన్న ఈ సినిమా నుంచి సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31వ తేదీన 'సూపర్ స్టార్ మాస్ స్ట్రయిక్' పేరుతో ఓ టైటిల్ వీడియోను రిలీజ్ చేస్తున్నారు. దీనిపై తాజాగా చిత్ర యూనిట్ మరో క్రేజీ న్యూస్ చెప్పింది.
'మెరుపులాంటి సూపర్ స్టార్ మాస్ స్ట్రయిక్ మరో రెండు రోజుల్లో రాబోతుంది. దీన్ని మా ప్రియమైన సూపర్ ఫ్యాన్స్‌తోనే మే 31వ తేదీన మీ సమీపంలోని థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నాము' అని చెప్పింది. అంతేకాదు, మరో మహేశ్ బాబు మాస్ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది.
ఈ మూవీని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే, శ్రీలీల ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని ఇస్తున్నాడు. ఇందులో ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం సహా ఎంతో మంది కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి 'గుంటూరు మిర్చి' టైటిల్ దాదాపుగా కన్ఫార్మ్ అయింది.


Click it and Unblock the Notifications











