SSMB28: మరోసారి రాజకీయాలను టచ్ చేయబోతున్న మహేష్.. షాక్ ఇచ్చే లీక్?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన 28వ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ అయితే మరికొన్ని రోజుల్లో మొదలు కాబోతోంది. అయితే సినిమా కాన్సెప్ట్ పై ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోయినప్పటికీ కూడా ప్రతిరోజు ఏదో ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన మరొక ఆసక్తికరమైన లీక్ కూడా అభిమానులలో హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే...

మూడవ సినిమా
మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఇదివరకే అతడు, ఖలేజా సినిమాలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాలు అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాకపోయినా కూడా రాబోయే మూడో సినిమా పై మాత్రం తప్పకుండా మార్కెట్లో సంచలనం సృష్టిస్తుంది అని అభిమానుల్లో ఒక గట్టి నమ్మకం అయితే ఉంది.

స్క్రిప్ట్ లో మార్పులు
ఒక విధంగా మహేష్ బాబు ఈ సినిమా ఒప్పుకోవడానికి చాలా సమయం తీసుకున్నాడు. అసలైతే గత ఏడాదిలోనే ఈ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. కానీ మహేష్ బాబు పూర్తి స్క్రిప్ట్ సిద్ధం అయ్యేవరకు కూడా షూటింగ్ స్టార్ట్ చేయడానికి ఇష్టపడలేదు. అనేకసార్లు స్క్రిప్టు మార్చాల్సి వచ్చింది. ఫైనల్ గా ఇటీవల స్క్రిప్ట్ నమ్మకంగా అనిపించడంతో షూటింగ్ చేసేందుకు మహేష్ గురించి సిగ్నల్ ఇచ్చాడు.

కొడుకు కోసం విదేశాల్లో మహేష్
ఇక మొత్తానికి ఇటీవల సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. సినిమా రెగ్యులర్ షూట్ ను ఆగస్టు సెకండ్ వీక్ లో స్టార్ట్ చేయనున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు తన కుమారుడి హాయ్యర్ స్టడీస్ కోసం ఫారిన్ వెళ్ళాడు. గౌతమ్ ను కాలేజ్ లో చేర్పించిన అనంతరం మహేష్ వచ్చే వారం ఇండియాకు రానున్నాడు.

పొలిటికల్ టచ్
ఇక ఈ సినిమాకు సంబంధించిన కథపై ఇదివరకే చాలా రకాల కథనాలు వచ్చాయి. అలాగే కొన్ని రాజకీయాలకు సంబంధించిన సీన్స్ కూడా ఉన్నాయని తెలుస్తోంది. మహేష్ బాబు ముఖ్యమంత్రి కుమారుడిగా ఈ సినిమాలో కనిపిస్తాడట. అలాగే కొన్ని ఎపిసోడ్స్ లో ప్రత్యేకంగా మినిష్టర్ గా కూడా కనిపిస్తాడని టాక్ వస్తోంది. ఆ పొలిటికల్ సన్నివేశాలు మొదట్లోనే ఎక్కువగా ఉంటాయట.

ఎమోషనల్ సీన్స్
ఇక సెకండాఫ్ లో అయితే మహేష్ బాబు ఫ్యామిలీకి సంబంధించిన ఎమోషనల్ సీన్స్ హార్ట్ టచింగ్ గా ఉంటాయని టాక్ వస్తోంది. ఏదేమైనా కూడా మహేష్ బాబును త్రివిక్రమ్ మరోసారి సరికొత్తగా చూపించాలని అనుకుంటున్నాడు. ఇక సినిమాలో పూజా హెగ్డే మేయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా మరొక ముఖ్యమైన పాత్ర కోసం యంగ్ హీరోయిన్ ను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది.

రిలీజ్ ఎప్పుడంటే?
ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ఆగస్టులో స్టార్ట్ చేసి ఇదే ఏడాది చివరి లోపు మొత్తం షూట్ ను ఫినిష్ చేయాలని ఫిక్స్ అయ్యారట. ఇక వచ్చే ఏడాది సమ్మర్ లో ఏప్రిల్ లో లేదా మే మొదట్లో వారంలో సినిమాను విడుదల చేయాలని ఒక టార్గెట్ సెట్ చేసుకున్నారు. ఇక సినిమాకు థమన్ మ్యూజిక్ అందించనున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











