SSMB28: మొత్తానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మహేష్ బాబు.. త్రివిక్రమ్ సినిమా వచ్చేది ఎప్పుడంటే?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల సర్కారు వారి పాట సినిమా తో అనుకున్నంత స్థాయిలో సక్సెస్ సాధించలేదు. ఆ సినిమా చాలా ఏరియాల్లో కూడా నష్టాలను మిగిల్చింది. ఇక ఇప్పుడు ఎలాగైనా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకోవాలని రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మాత్రం మొదలు కాలేదు. త్వరలోనే మొదలు పెట్టాలని కూడా ఇటీవల ఒక ప్లాన్ రెడీ చేశారు. ఇక సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారు అనే విషయంలో కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్లు ప్రకటన ఇచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

బాక్సాఫీస్ కాంబినేషన్
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు ఇది వరకే అతడు, ఖలేజా సినిమాలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాలు బాక్సాఫీసు వద్ద అంతగా సక్సెస్ కాలేకపోయాయి. అయినప్పటికీ త్రివిక్రమ్ బాక్సాఫీస్ ట్రాక్ మీద నమ్మకంతో మహేష్ బాబు సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. ఈ కాంబినేషన్ పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.

అందుకే ఆలస్యం
అసలైతే మహేష్ బాబుతో త్రివిక్రమ్ కొత్త సినిమాను గత ఏడాదిలోనే మొదలు పెట్టాలని అనుకున్నారు. కానీ అప్పటికి పూర్తి స్థాయిలో స్క్రిప్టు సిద్ధం కాకపోవడంతో మహేష్ బాబు ఒప్పుకోలేదు. మొత్తం పూర్తిస్థాయిలో స్క్రిప్టు సిద్ధం అయితే గాని సినిమా చేయడానికి మహేష్ నిర్ణయం తీసుకోలేక పోయాడు. దీంతో చాలాసార్లు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ స్క్రిప్ట్ లో ఎన్నో మార్పులు చేయాల్సి వచ్చింది. మహేష్ విదేశాల్లో ఉన్నప్పుడు కూడా త్రివిక్రమ్ అక్కడికి వెళ్లి మరి రెండు మూడు సార్లు కథలను కూడా చెప్పాడు.

షూటింగ్ స్టార్ట్
ఇక మొత్తానికి ఇటీవల మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆగస్టు మొదటి వారంలో సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని ఇటీవల నిర్మాతలతో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నాడు. అఫిషియల్ గా మరో క్లారిటీ కూడా ఇచ్చేశారు.

మహేష్ క్యారెక్టర్?
మహేష్ బాబును SSMB28 సినిమాలో త్రివిక్రమ్ ఎలా ప్రజెంట్ చేస్తాడు అనేది కొందరిలో ఎంతో ఆసక్తిని కలిగిస్తోంది. ఇక ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం అయితే సినిమా లో మహేష్ బాబు ఒక మంచి ఫ్యామిలీ పర్సన్ గానే కాకుండా ఒక యాక్షన్ పాత్రలో కూడా కనిపిస్తాడు అని తెలుస్తోంది. రెండు విభిన్నమైన డైమెన్షన్స్ లో మహేష్ బాబు ఆకట్టుకుంటాడు అని సమాచారం.
రిలీజ్ ఎప్పుడంటే?
ఇక SAMB28 సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే విషయంలో కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఆగస్టు లో మొదలు పెట్టి సినిమా షూటింగ్ పనులన్నింటినీ ఇదే ఏడాది పూర్తిచేసు కోవాలని ఫిక్స్ అయ్యారు. ఇక 2023 సమ్మర్ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనౌన్స్మెంట్ లో తెలియజేశారు.

రాజమౌళి సినిమా?
అసలైతే సంక్రాంతికి SSMB28 సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు. కానీ షూటింగ్ ఆలస్యంగా స్టార్ట్ కావడం వలన సమయం సరిపోదని ప్రాజెక్టును సమ్మర్ కి విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్టు అనంతరం మహేష్ బాబు రాజమౌళి తో మొదటి పాన్ ఇండియా సినిమా స్టార్ట్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఆ ప్రాజెక్ట్ కోసం మహేష్ దాదాపు రెండేళ్ళ వరకు బిజీ అయ్యే అవకాశం ఉందట.


Click it and Unblock the Notifications











