For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Sarkaru Vaari Paata: మహేశ్ నోటి వెంట జగన్ మాట.. అచ్చం సీఏంను దించేశాడుగా!

  |

  సుదీర్ఘ కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో హవాను చూపిస్తూ బడా హీరోగా వెలుగొందుతోన్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. యాక్టింగ్ మాత్రమే కాదు.. మిగిలిన విభాగాల్లోనూ రాణిస్తూ సత్తా చాటుతోన్న అతడు.. తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అదే సమయంలో వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ సందడి చేస్తున్నాడు. ఇక, ఈ మధ్య కాలంలో ఈ స్టార్ హీరో 'భరత్ అనే నేను', 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' వంటి సూపర్ డూపర్ హిట్లతో హ్యాట్రిక్‌ను నమోదు చేసుకున్నాడు. దీంతో అతడి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఫలితంగా మహేశ్ బాబు కూడా రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నాడు.

  Bigg Boss Non Stop: నీ బటన్స్ తీసి బ్రా చూపించు.. ఆమెతో శివ అసభ్యంగా.. నాగార్జున వీడియో చూపించడంతో!

  వరుస హిట్లతో ఫుల్ ఫామ్‌లో ఉన్న స్టార్ హీరో మహేశ్ బాబు ప్రస్తుతం 'సర్కారు వారి పాట' అనే సినిమాలో నటిస్తున్నాడు. కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న పరశురాం పెట్ల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పారిపోతోన్న బడా వ్యాపారవేత్తల కథతో ఈ సినిమాను మెసేజ్ ఓరియెంటెడ్‌గా రూపొందిస్తున్నట్లు ఆరంభం నుంచే వార్తలు వస్తున్నాయి. దీంతో ప్రకటన సమయం నుంచే ఈ మూవీపై అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ చిత్రాన్ని పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా మాస్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కించి విడుదలకు రెడీ చేస్తున్నారు.

  Mahesh Babu Uses YS Jagan Dialogue in Sarkaru Vaari Paata

  టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న 'సర్కారు వారి పాట'కు సంబంధించిన షూటింగ్ ఎప్పుడో మొదలైంది. కానీ, ఈ చిత్రం నుంచి గత ఏడాది 'సర్కారు వారి పాట బర్త్‌డే బ్లాస్టర్' పేరిట ఓ టీజర్ వీడియోను మాత్రమే వదిలారు. ఆ తర్వాత ఒక్కొక్కటిగా పాటలను రిలీజ్ చేస్తున్నారు. వీటికి ఒక దానికి మించి ఒకటి అన్నట్లుగా ప్రేక్షకుల నుంచి స్పందన దక్కుతోంది. ఫలితంగా ఇవన్నీ రికార్డు స్థాయిలో వ్యూస్‌ను రాబట్టి సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అలాగే సోషల్ మీడియాలోనూ విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ఫలితంగా ఈ సినిమాపై ఉన్న అంచనాలన్నీ రెట్టింపు అవుతూనే ఉన్నాయి.

  టాప్‌ను పైకి లేపి షాకిచ్చిన హీరోయిన్: ప్రైవేట్ భాగాలు కనిపించేలా తెలుగు నటి సెల్ఫీ వీడియో

  'సర్కారు వారి పాట' మూవీని మే 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు. ఇందుకోసం తాజాగా ఈ సినిమా నుంచి అఫీషియల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇది ఆద్యంతం ఆకట్టుకునేలా మాస్ ట్రీట్‌తో కట్ చేశారు. మరీ ముఖ్యంగా ఇందులో మహేశ్ బాబు బాడీ లాంగ్వేజ్, డైలాగ్స్, స్వాగ్ ఆకట్టుకున్నాయి. ప్రతి విజువల్ కన్నుల పండుగగా ఉంది. ఇక, ఇందులో హీరోయిన్‌తో 'నేను విన్నాను.. నేను ఉన్నాను' అని మహేశ్ బాబు చెప్పిన ఓ డైలాగ్ తెగ హాట్ టాపిక్ అవుతోంది. దీనికి కారణం గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి.. ఎన్నికలకు ముందు చేసిన ప్రచారంలో దీన్ని పదే పదే అనడమే. ఇక.. మహేశ్ చెప్పిన ఈ డైలాగ్‌పై భిన్న స్పందనలు కూడా వస్తున్నాయి.

  'సర్కారు వారి పాట' మూవీలో మహేశ్‌కు జోడీగా మహానటి కీర్తి సురేష్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో సముద్రఖని, జగపతిబాబు సహా ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను పోషిస్తున్నారు.

  English summary
  Mahesh Babu Now Doing Sarkaru Vaari Paata Movie under Parasuram Direction. Mahesh Babu Uses YS Jagan Dialogue in This Movie Trailer.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X