»   » మహేష్ బాబు - వంశీ పైడిపల్లి చిత్రం డీటేల్స్

మహేష్ బాబు - వంశీ పైడిపల్లి చిత్రం డీటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, బృందావనం లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన వంశీ పైడిపల్లి కాంబినేషన్లో త్వరలో ఓ చిత్రం రాబోతోంది. వంశీ పైడిపల్లి ఇప్పటికే మహేష్ బాబును కలిసి స్టోరీ వివరించాడు. వంశీ చెప్పిన కథకు మహేష్ బాబు బాగా ఇంప్రెస్ అయి, స్ర్కిప్టును పూర్తి వినోదాత్మకంగా డెవలప్ చేయాలని సూచించాడు.

ప్రస్తుతం రామ్ చరణ్‌తో 'ఎవడు' చిత్రం తెరకెక్కిస్తున్న వంశీ పైడిపల్లి మాట్లాడుతూ...'ఎవడు చిత్రాన్ని జులై నెలలో గ్రాండ్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. 2014 జనవరి నెలలో మహేష్ బాబుతో నా తర్వాతి సినిమా ప్రారంభం అవుతుంది' అని వెల్లడించారు.

మహేష్ బాబు కోసం ఇప్పటికే స్టోరీ రెడీ చేసుకున్న వంశీ పైడిపల్లి, స్క్రిప్టు విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టబోతున్నారు. రొమాంటిక్ అండ్ యాక్షన్ ఎంటర్టెనర్‌గా వైవిద్యమైన కథ, స్ర్కిప్టుతో ఈచిత్రాన్ని ప్లాన్ చేస్తాడని తెలుస్తోంది. అదే విధంగా మహేష్ బాబు లుక్ కూడా గత సినిమాలకు భిన్నంగా ఉండేలా చూసుకుంటున్నాడు.

ప్రస్తుతం మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో '1' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వరుస హిట్ సినిమాలతో దూసుకెలుతున్న మహేష్ ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ పొజిషన్లో ఉన్నాడు. '1' సినిమాతో మహేష్ తిరుగులేని హీరోగా మారతాడనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

English summary
Super Star Mahesh Babu has given his final nod for a new film to be directed by Vamsi Paidipally. On the other hand, director Vamsi is busy with an action thriller Yevadu. 'We are planning for a grand release of Yevadu in July.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu