»   » మహేష్ బాబు అపుడు చాలా బుడ్డోడు, వెంకీ పైకెక్కి.. ( రేర్ ఫోటోష్)

మహేష్ బాబు అపుడు చాలా బుడ్డోడు, వెంకీ పైకెక్కి.. ( రేర్ ఫోటోష్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సూపర్ స్టార్ మహేష్ బాబు... టాలీవుడ్ టాప్ హీరో. మంచి వ్యక్తిత్వం, సేవాగుణంతో పాటు వివాద రహితుడుగా మహేష్ బాబుకు ఇండస్ట్రీలో మంచి పేరుంది. సినిమా కుటుంబం నుండి రావడంతో చిన్నతంలోనే బాలనటుడిగా తెరంగ్రేటం చేసిన ఆయన ప్రస్తుతం టాలీవుడ్ నెం.1 హీరోగా ఎదిగారు.

షాక్ అయ్యే విషయాలు: మహేష్ బాబు భార్య గురించి మీకు తెలియనివి..(ఫోటోస్)

తన టాలెంటుతో భారీ సంఖ్యలో అభిమానులను ఏర్పరచుకోవడంతో పాటు నంది అవార్డులు, ఉత్తమ నటుడిగా అనేక సినీ అవార్దులు ఆయన సొంతం చేసుకున్నారు. ఈ రోజు మహేష్ బాబు పుట్టినరోజు. సూపర్ స్టార్ కృష్ణ-ఇంద్రాదేవిల సంతనం అయిన మహేష్ బాబు ఆగస్టు 9, 1975లో తమిళనాడులోని చెన్నైలో జన్మించారు. ప్రస్తుతం ఆయన వయసు 41.

మహేష్ బాబు జీవన విధానం కూడా ఇతర స్టార్లతో పోల్చితే భిన్నంగా ఉంటుంది. ఆయన పూర్తిగా ఫ్యామిలీ మ్యాన్. సినిమాలు, ఇల్లు తప్ప ఆయనకు మరో ప్రపంచం తెలియదంటే అతిశయోక్తి కాదేమో. అంతే కాదు... ఆయనకు ఇండస్ట్రీలో స్నేహితులు కూడా తక్కువే. కుటుంబానికి, కుటుంబ విలువలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. మాజీ ఫెమీనా మిస్ ఇండియా నమ్రత శిరోద్కర్‌తో 5 సంవత్సరాలు డేటింగ్ చేసిన మహేష్ బాబు ఆమెను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఫిబ్రవరి 10, 2005లో వీరి వివాహం ముంబైలో జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. కుమారుడి పేరు గౌతంకృష్ణ, కూతురు పేరు సితార. మహేష్ బాబుకు సంబంధించిన చిన్ననాటి అరుదైన ఫోటోలపై ఓ లుక్కేయండి.

మరిన్ని మహేష్ బాబు బుడ్డోడుగా ఉన్నప్పటి ఫోటోస్ స్లైడ్ షోలో...

వెంకీ ఎత్తుకున్నాడు

వెంకీ ఎత్తుకున్నాడు


మహేష్ బాబు బుడ్డోడుగా ఉన్నపుడు వెంకీ ఎత్తుకున్న ఫోటో. దీంతో పాటు టీనేజ్ ఫోటో, కొడుకు గౌతం కృష్ణతో కలిసి

సోదరుడు రమేష్ బాబుతో కలిసి మహేష్ బాబు

సోదరుడు రమేష్ బాబుతో కలిసి మహేష్ బాబు


సోదరుడు రమేష్ బాబు, సిస్టర్స్ మంజుల, ప్రియదర్శినిలతో కలిసి మహేష్ బాబు చిన్నతనంలో..

చైల్డ్ ఆర్టిస్టుగా

చైల్డ్ ఆర్టిస్టుగా


అన్నయ్య రమేష్ బాబుతో కలిసి చైల్డ్ ఆర్టిస్టుగా ఉన్న సమయంలో మహేష్ బాబు ఇలా..

ఫ్యామిలీ

ఫ్యామిలీ


తండ్రి కృష్ణ, సోదరుడు రమేష్ బాబులతో కలిసి మహేష్ బాబు. ఆ వయసులో మహేష్ బాబు చాలా ముద్దొచ్చేలా ఉన్నాడు కదూ..

ఫ్యామిలీతో..

ఫ్యామిలీతో..


ఫ్యామిలీతో కలిసి ఫంక్షన్‌కు హాజరైన మహేష్. చిత్రంలో ఆయన తండ్రి కృష్ణ, సోదరి మంజుల కూడా ఉన్నారు.

బాల నటుడిగా

బాల నటుడిగా


మహేష్ బాబు 9 సినిమాల్లో బాల నటుడిగా, 17 సినిమాల్లో హీరోగా నటించారు.

ప్రెండ్స్

ప్రెండ్స్


క్లోజ్ ఫ్రెండ్స్ తో కలిసి మహేష్ బాబు. చిత్రంలో ఆయన భార్య నమ్రత, సోదరి మంజుల, నటుడు సుమంత్ కూడా ఉన్నారు.

మహేష్ బాబు

మహేష్ బాబు


తనయుడు గౌతంతో కలిసి మహేష్ బాబు. మహేష్ బాబు పిల్లలతో గడపడానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో ఈ చిత్రం చూసి అర్థం చేసుకోవచ్చు.

గౌరవం

గౌరవం


తండ్రి కృష్ణతో కలిసి మహేష్ బాబు. తండ్రి పట్ల మహేష్ బాబు ఎంతో గౌరవంతో ఉంటారు.

English summary
Mahesh Babu, born on August 9,1975, turns a year older today. We wish the 40-year-old actor the best on his birthday. Mahesh Babu is an Indian actor, producer, media personality, and philanthropist known for his works in Telugu cinema. He owns the production house G. Mahesh Babu Entertainment Pvt. Ltd.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu