‘సీతమ్మ వాకిట్లో...’ రిలీజ్ డేట్ ఖరారు
హైదరాబాద్: మహేష్ బాబు-వెంకటేష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 21న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. త్వరలో టాకీపార్ట్ పూర్తికానుంది. పాటల చిత్రీకరణ మిగిలివుంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి డిసెంబర్ 21న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ చిత్రం గురించి దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ...అన్న మాట ఆ తమ్ముడికి వేదవాక్కు. తమ్ముడంటే అన్నయ్యకు పంచ ప్రాణాలు. మమతానురాగాలు వెల్లివిరిసే ఉమ్మడి కుటుంబం వారిది. ఆ ఇంట్లో అనునిత్యం ఉగాదులు, ఉషస్సులే. మట్టిపరిమళాల సుగంధాలు..పైరగాలి జాడలు..సంక్రాంతి సంబరాలతో ఓ కోవెలలా కొలువుదీరిన ఒక అందమైన పల్లెటూరి కథే 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' అని వెల్లడించారు.
ఉమ్మడి కుటుంబంలోని బాంధవ్యాలు గత స్మృతులుగానే మిగిలిపోతున్నాయి. వాటన్నింటినీ తిరిగి మనకళ్లముందుంచుతూ రూపొందిస్తున్న దృశ్యకావ్యమే మా సినిమా... అన్నదమ్ముల బంధంలోని ఔన్నత్యాన్ని ఈ చిత్రంలో ఆవిష్కరిస్తున్నాం' అన్నారు. రోహిణి, రావు రమేష్, ఆహుతి ప్రసాద్, బ్రహ్మానందం, రమా ప్రభ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కె.వి.గుహన్, సంగీతం: మిక్కీ జే మేయర్, సహనిర్మాతలు: శిరీష్-లక్ష్మణ్, పాటలు: సిరి సీతారామశాస్త్రి.


Click it and Unblock the Notifications











